నీలిరంగు చీరలోన చందమామ నీవే జానా అనేలా ఉన్న అనుపమ

     Written by : smtv Desk | Mon, Mar 18, 2024, 05:41 PM

నీలిరంగు చీరలోన చందమామ నీవే జానా అనేలా ఉన్న  అనుపమ

టాలీవుడ్ లో శతమానం భవతి సినిమా తో సౌత్‌ లో మోస్ట్‌ పాపులర్ నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ మరియు మలయాళ భాషా చిత్రాల్లో కూడా వరుసగా నటిస్తోంది.అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకున్నది.అంతేకాకుండా ప్రేమమ్‌ సినిమా తో సౌత్‌ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. చాలా తక్కువ మంది హీరోయిన్స్ స్కిన్ షో చేయకుండా హీరోయిన్స్ గా రాణించగలరు. అందులో అనుపమ పరమేశ్వరన్ ఒకరు అనడంలో సందేహం లేదు


కెరీర్‌ ఆరంభం నుంచి కూడా అనుపమ చాలా తక్కువ స్కిన్‌ షో చేస్తూ వచ్చింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేయడం ద్వారా ఈ అమ్మడు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆకట్టుకునే అందం, అభినయం , నటన ఈ అమ్మడి సొంతం అంటూ తాజా ఫోటోలతో మరోసారి నిరూపించింది.

బ్లూ చీర కట్టు లో నడుము అందం చూపిస్తూ సెల్ఫీ లకు ఫోజ్ ఇస్తూ కుర్రాలని రెచ్చకొట్టుతు ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ రేంజ్ లో అందంగా ఉన్న అనుపమ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ తో కలిసి టిల్లు స్క్వేర్‌ సినిమాలో నటించింది. త్వరలో ఆ సినిమా విడుదల అవ్వబోతుంది. డీజే టిల్లు సూపర్‌ హిట్‌ అవ్వడంతో దానికి సీక్వెల్‌ గా రాబోతున్న టిల్లు స్క్వేర్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది. ఇప్పటికే చాలా రోజుల క్రితం సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ ట్యాక్సీలో రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్న పోస్టర్‌ ఒకటి లాంఛ్ చేయగా. అది నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. మరి ఈ సినిమా అనుపమను ఏ రేంజ్ లోకి తీసుకెళుతోంది చూడాలి మరి .






Untitled Document
Advertisements