నేట్టింట వైరల్ గా మారిన మెగాస్టార్ ఆ సర్టిఫికెట్‌

     Written by : smtv Desk | Mon, Mar 18, 2024, 06:02 PM

నేట్టింట వైరల్ గా మారిన మెగాస్టార్ ఆ సర్టిఫికెట్‌

టాలీవుడ్ లో మెగాస్టార్ర్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ మరే ఇతర హీరోలకు లేదు అనుకోవచ్చు . ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి . ఆయన గురించి బయటకు వచ్చిన ఏ విషయం అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది . ఇప్పుడు మెగాస్టార్ 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్‌ కారణంగా వార్తల్లో నిలిచారు. ఎలా బయటకు వచ్చిందో.. ఎప్పుడు బయటకు వచ్చిందో తెలీదు కానీ చిరంజీవి యొక్క 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
సర్టిఫికెట్‌ లో ఉన్న వివరాలు ఏంటి అంటూ క్షుణ్ణంగా తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సర్టిఫికెట్‌ లో చిరంజీవి పూర్తి పేరును కేఎస్‌ఎస్‌ వర ప్రసాద్‌ అని, తండ్రి పేరు వెంకట్‌ రావు అని ఉంది. అంతే కాకుండా చిరంజీవి పెనుగొండ లో పుట్టినట్లుగా కూడా అందులో పేర్కొన్నారు. చిరంజీవికి చెందిన ఈ సర్టిఫికెట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది ఏ సందర్భంలో తీసుకోవడం జరిగింది, ఎలా బయటకు వచ్చింది అనేది చిరంజీవి స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. ఈ విషయమై ఆయన స్పందించక పోవచ్చు. కనుక ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లుతున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్నాడు.నిన్న మొన్నటి వరకు తాను నటిస్తున్న విశ్వంభర సినిమాతో వార్తల్లో నిలిచిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సర్టిఫికెట్ గురించి మెగాస్టార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి .





Untitled Document
Advertisements