పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను నియమిస్తా.. కేసీఆర్

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 05:51 AM

పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను నియమిస్తా.. కేసీఆర్

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం గడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఓటమి పాలైనప్పటి నుండి ఒకటి తరువాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రజలు ఎన్నికలల్లో ఓడిస్తే, సొంత పార్టీ నేతలు పార్టీని వీడి పక్క పార్టీలకు వలసలు ప్రారంభించారు. ఇదంతా ఒకటైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుంట్ల కవిత అరెస్ట్ పార్టీ నేతలకు మింగుడు పదని విషయంగా మారింది. అయితే కూతురు అరెస్ట్, సొంత పార్టీ నేతలు కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్న వేళ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని తెలిపారు. ప్రవీణ్ కుమార్ నేడు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రవీణ్ కుమార్‌కు మరిన్ని ఉన్నత పదవులలో అవకాశాలు కల్పిస్తామన్నారు. పార్టీని నిర్మాణం చేసుకుందాం.. కమిటీలు వేసుకుందామని తెలిపారు. ఇక్కడే నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించుకుందామని సూచించారు. రానున్న రోజుల్లో మనం అద్భుతమైన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తాను తెలంగాణ ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడానన్నారు. వందలాది సంఘటనలను ఉద్యమంలో చూశానని.. ఆంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం అంటే నినాదాలు చేస్తూ చేతిలో రాళ్లు పట్టుకోవడం కాదని.. ఉద్యమానికి ఒక పద్ధతి , సిద్దాంతం ఉంటుందన్నారు. వ్యవసాయం స్థిరీకరణ జరగాలని రైతు బంధు తీసుకువచ్చినట్లు చెప్పారు. దళితబంధు తెచ్చినా దళిత సమాజం ఎందుకు ఈ పథకాన్ని అభినందించలేదని వాపోయారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తాను పడ్డ అవమానాలు, తిట్లు, ఇబ్బందులు ఎవరు పడలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి, కేంద్రంలో ఒక పదవి ఇస్తామని తనకు కొందరు ఆఫర్ చేశారని గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాడాలని. సమస్యలు పరిష్కరించాలన్నారు.
రాష్ట్రంలో దళిత బంధు ఇస్తే అంబేడ్కర్ మనవడు ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పేట్టి, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి అంబేద్కర్ ఇల్లు అని అభినందించారన్నారు. తెలంగాణలో దళితుల మీద దాడి జరిగితే ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలన్నారు. మరి కేసీఆర్ అన్నట్టుగా తమ పార్టీకి మంచి రోజులు వస్తాయో రావో చూడాలి.





Untitled Document
Advertisements