ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ ఆటపై స్పష్టత!

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 05:58 AM

ఐపీఎల్ లో  కేఎల్ రాహుల్  ఆటపై స్పష్టత!

ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో తగిలిన గాయం కారణంగా సీరీస్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో గాయమైన రాహుల్ ఐపీఎల్ లో ఆడతాదా లేదా అనే అనుమానం అందరిలో నెలకొంది. తాజాగా రాహుల్ ఐపీఎల్ లో ఆడడంపై స్పష్టత వచ్చింది. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్ నెస్ సాధించాడని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే) నిర్ధారించింది.

కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే, ఇటీవల కేఎల్ రాహుల్ తరచుగా గాయాల బారినపడుతున్నాడు. దాంతో అతడు ఐపీఎల్-2024లో ఆడడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో, కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కు ఎన్సీయే నుంచి శుభవార్త అందింది. అయితే, ఇప్పట్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయకపోవడమే మంచిదని, కేవలం బ్యాట్స్ మన్ గా కొనసాగాలని ఎన్సీయే సూచించింది.

ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 22న ప్రారంభం కానుండగా, లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి మ్యాచ్ ను మార్చి 24న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. తిరిగి రాహుల్ ఫామ్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. రాహుల్ ఆడబోయే
మ్యాచ్ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





Untitled Document
Advertisements