మనవడు పుట్టిన ఐదు నెలలకే కోట్లకు అధిపతిని చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 06:43 AM

మనవడు పుట్టిన ఐదు నెలలకే కోట్లకు అధిపతిని చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

ఈమధ్యకాలంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులు తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇన్నేళ్ళుగా కంపెనీ అభివృద్దే లక్ష్యంగా పనిచేసిన ఈ జంట ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంటర్వులలో పాల్గొంటూ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పబ్లిక్ తో షేర్ చేసుకుంటూనే యువత తమ కలలను నిజం చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలను కూడా చక్కగా వివరిస్తున్నారు. ఇక వీరి వ్యక్తిగత జీవితానికి వస్తే వీరికి ఇద్దరు సంతానం. వారు అక్షత మూర్తి, రోహన్ మూర్తి. అక్షత మూర్తి భర్త బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ అన్న సంగతి తెలిసిందే. ఇక కుమారుడు రోహన్ మూర్తి 2019లో అపర్ణ కృష్ణన్ ను రెండో వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడి పేరు ఏకాగ్రహ్.
ఇక అసలు విషయానికొస్తే.. నారాయణమూర్తి తన మనవడు ఏకాగ్రహ్ కు అదిరిపోయే కానుక ఇచ్చారు. తమ సంస్థలోని 15 లక్షల షేర్లను ఆయన మనవడి పేర బదిలీ చేశారు. ఈ మేరకు బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొన్నారు.
మనవడు ఏకాగ్రహ్ కు నారాయణమూర్తి బదిలీ చేసిన షేర్ల విలువ రూ.240 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంతకీ ఏకాగ్రహ్ వయసు ఐదు నెలలే. గత నవంబరులో జన్మించాడు. నారాయణమూర్తికి ఇన్ఫోసిస్ లో 1.51 కోట్ల షేర్లు ఉన్నాయి. కంపెనీలో ఆయన వాటా 0.40 శాతం ఉంటుంది. ఆయన మనవాడి పేర బదీలి చేసిన షేర్ల విలువ తెలిసి పుట్టగానే వందల కోట్లకు అధిపతి అయిపోయాడుగా అంటూ విషయం తెలిసినవారు ఆశ్చర్యపోతున్నారు.





Untitled Document
Advertisements