మళ్ళీ కాలబైరవుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్.. ఎప్పుడంటే?

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 06:58 AM

మళ్ళీ కాలబైరవుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్.. ఎప్పుడంటే?

ఈ మధ్యకాలంలో రీరీలీజ్ ల హావ మొదలైంది. స్టార్ హీరోల హిట్ చిత్రాలను మళ్ళీ రిలీజ్ చేసి సోమ్ము చేసుకుంటున్నారు మేకర్స్. ప్రేక్షకులు కూడా ఇప్పటికే కొన్ని వందలసార్లు టీవీలలో వచ్చిన సినిమా అయినా సరే మళ్ళీ థియేటర్ లకు వెళ్లి చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సమయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా అయన నటించి సినిమా ఒకటి రీ రిలీజ్ కు సిద్దం అవుతుంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మగధీర చిత్రం మళ్లీ విడుదలవుతోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మెగా బ్లాక్ బస్టర్ మగధీర చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు.

తమను ప్రోత్సహించి, ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.

తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని మరోసారి ఆదరించి ఘన విజయాన్ని అందించాలని, తద్వారా రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నామని తెలిపారు. మరి ఈ మేగా వారసుడి రీ రిలీజ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారు అనేది చూడాలి.





Untitled Document
Advertisements