ఈసారి హోలీ వేడుకలకు ఇంట్లోనే కెమికల్ ఫ్రీ రంగులను తయారు చేయండిలా..

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 07:18 AM

ఈసారి హోలీ వేడుకలకు ఇంట్లోనే కెమికల్ ఫ్రీ రంగులను తయారు చేయండిలా..

హోలీ ఇది పిల్లా, పెద్దా అనే తేడా లేకుండా అంత ఒక్క కత చేరి ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుని ఆడుకునే పండగ. కేవలం రంగులే కాకుండా కొంతమంది టమాటాలు, కోడి గుడ్లను సైతం ఈ ఆటలో వినియోగిస్తారు. ఒక్కోసారి మన అతి సరదాతో అవతలి వారి కడుపులోకి సైతం ఈ రంగులు పోయేటట్టుగా నోట్లో, పళ్లకు సైతం రంగు పులమడం మనం చూస్తూనే ఉంటాము. ఆడుకోవడం సరదాగానే ఉంటుంది కానీ, కెమికల్స్ తో కూడిన ఈ రంగులను చర్మం, మొహం పై పూసుకోవడం ద్వారా ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అసలు రంగుల్లోని కెమికల్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

* కెమికల్ కంపోజిషన్.. సాధారణంగా హోలీ రంగులు హానికరమైన రసాయనాల మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఈ కెమికల్స్ లో మెర్క్యురీ, క్రోమియం, లెడ్ వంటి విషపూరితమైన లోహాలు ఉంటాయి. ఇవి మనుషుల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి రంగులు పూయడం ద్వారా చర్మం పై చికాకు, అలెర్జీ సమస్యలకు దారి తీస్తాయి.

* శ్వాస సంబంధిత సమస్యలు.. సహజంగా హొలీ సమయంలో పొడి రంగులు వాడడం ద్వారా.. అవి గాలిలో చేరి సూక్ష్మ కణాలుగా మారుతాయి. ఈ రంగులతో కూడిన గాలిని పీల్చడం ద్వారా శ్వాసకోశాన్ని చికాకు పెట్టి.. దగ్గు, తుమ్ములు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ముఖ్యంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడేవారిలో వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

* కంటి ఆరోగ్యం.. హొలీ రంగుల్లో ఉండే హానికరమైన రసాయనాలు చర్మం పై దద్దుర్లు, చికాకు, దురదను కలిగిస్తాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం కలిగిన వారికి ఇవి మరీ ప్రమాదకరం. అంతేకాదు ఈ రంగులు కళ్ళల్లో పడినప్పుడు కళ్ళలో మంట, ఎరుపుగా మారడం కొన్ని సందర్భాల్లో కంటి పొర పూర్తిగా దెబ్బతినడం జరుగుతుంది.

* పర్యావరణానికి హానీ.. ఈ రంగుల్లోని కెమికల్స్ ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి కూడా హానికరం. చర్మం పై ఉన్న ఈ రంగులను కడిగినప్పుడు ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న చెరువులు, కాలువల్లో కలిసి పోవడం జరుగుతుంది. ఇది నీటి కాలుష్యానికి దారితీస్తుంది. అంతే కాదు దీని వల్ల జల జీవనానికి కూడా హానీ కలుగుతుంది.

ఈ రంగుల నుంచి కలిగే దుష్ప్రభావాలను తగ్గించడానికి సహజ ఉత్పత్తులతో తయారు చేసిన రంగులను ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు పసుపు, బీట్ రూట్, బచ్చలికూర వంటి మొక్కల ఆధారిత వనరులతో చేసిన రంగులను వాడాలి. ఇది ఆరోగ్యానికి, పర్యావరణానికి రెండింటికీ మంచిది. కనుక ఈసారి హోలీ వేడుకలలో కెమికల్స్ తో తాయారు చేసిన రంగులకు బదులుగా సహజ ఉత్పత్తులను ఎంచుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ ఆనందాన్ని పెంచుకోండి.





Untitled Document
Advertisements