తలిదండ్రులుగా రేపటి తరం బంగారు భవితకు మార్గం వేయండిలా..

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 09:24 AM

తలిదండ్రులుగా రేపటి తరం బంగారు భవితకు మార్గం వేయండిలా..

పిల్లల పెంపకం అంటేనే తలిదండ్రులు భయపడేలా ఉన్నాయి ప్రస్తుత రోజులు. ఎందుకంటే పిల్లలు కొంత వయస్సు వచ్చిన తర్వాత ఎక్కువగా చెడు వ్యసనాలకు అలవాటు పడి పోతున్నారు . అందుకే తల్లిదండ్రులు మొదటి నుండి కుడా వారి పెంపకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి . తలిదండ్రులపెంపకమే వారు ఎదగడానికి, ఆత్మవిశ్వాసంతో ఉండటానికి సహాయపడుతుంది. మరి పిల్లల్ని స్మార్ట్ గా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిందేంటో చూదాం .

ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు జీవితంలో ఎన్ని సమస్యలొచ్చినా ముందుకు సాగిపోతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. అయితే పిల్లల ఎదుగుదల అనేది వారి తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుంది. మనల్ని మనం మంచి రోల్ మోడల్స్ గా మార్చుకోవడం వల్ల మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అలాగే ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. ఇది వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయడానికి మంచి మార్గం . అంతేకాకుండా పిల్లల్ని స్మార్ట్ గా తయారుచేస్తుంది.


కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతుంటారు. అంటే వాళ్లు ఏ పనీ చేయలేరు. దీనికి ఇంటి వాతావరణమే కారణమని అనుకుంటారు. నిజానికి ఇంటి వాతావరణం కూడా పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, సంతోషాలతో ఉండాలని నిపుణులుచెబుతున్నారు. అలాగే మీ పిల్లలు చేసే పనిని ప్రోత్సహించాలి.

మనం ఎలాంటి విజయం సాధించినా దాని వెనుక మన పాజిటివిటీ ఉంటుంది. అందుకే మీ పిల్లలను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండేలా ప్రేరేపించండి. అలాగే వారు చేసే పాజిటీవ్ పనులు విఫలమైనప్పటికీ వారిని ఎంకరేజ్ చేయండి. ఓటమి, విజయం జీవితంలో ఒక భాగం మాత్రమేనని వారికి అర్థమయ్యేలా చెప్పండి.

పిల్లలను అర్థం చేసుకోవడం చాలా కష్టమంటారు చాలా మంది. కానీ ఇది తల్లిదండ్రులకు చాలా సులువైన పని. పిల్లలతో మీరు రోజూ మాట్లాడితే.. వారిని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తే పిల్లలు తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని చెప్తారు. మీ పిల్లలు స్మార్ట్ గా మారాలన్నా, జీవితంలో మంచి పొజీషన్ కు ఎదగాలన్నా మీరు మీ పిల్లల ఆలోచనలు, శక్తులను అర్థం చేసుకోవాలి. దానికి తగినట్లుగా వారిని ఎంకరేజ్ చేయాలి .


పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మరింత స్థితిస్థాపకంగా ఉంచడానికి వారికి ఆధ్యాత్మిక వికాసం చాలా అవసరం. ఇది పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇది మంచి, తప్పుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది వారిలో నిర్ణయం తీసుకునే శక్తిని కూడా పెంపొందిస్తుంది. అదే విధంగా వారికి దేవుడు అంటే ఏంటో చెప్పండి. దేవుని శక్తిని, ఆయనపై విశ్వాస స్ఫూర్తిని మేల్కొల్పండి.మనము ఎవరికీ అయినా సాయం చేస్తే ఆ సాయం వలన దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సాయం చేస్తాడు అని చెప్పండి . ఏదైనా పనిపై దృష్టి పెట్టడం, విజయం కోసం సాధన చేయడం వల్ల పిల్లల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఇది నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అందుకే పిల్లలకు అభ్యాసం అలవాటు చేయండి. ప్రతిరోజూ వారితో ధ్యానం చేయడం , యోగ చేయడం , వలన చేసే పనిలో నిబద్ధత భావం పెరుగుతుంది. మొదట తల్లిదండ్రులు పిల్లలకి వారిపైన వారికీ నమ్మకం కలిగే విధంగా ఆలోచన విధానాన్ని చిన్నపటి నుండి కల్పించాలి అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు .







Untitled Document
Advertisements