కిడ్నిల ఆరోగ్యానికి కొత్తిమీర బెస్ట్!

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 10:21 AM

కిడ్నిల ఆరోగ్యానికి కొత్తిమీర బెస్ట్!

మన శరీరంలో చిక్కుడు గింజ ఆకారంలో ఉండి, శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు ఉపయోగపడే అవయవం కిడ్నీలు, ఇవి శరీరంలో ఫిల్టర్‌గా పనిచేస్తాయి. కొన్ని ఆహారపు అలవాట్లు కిడ్నీలపై ప్రభావం చూపుతున్నాయి. చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అందువల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. చాల మంది వాటర్ తక్కువగా తాగడం వలన శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా అయి లేదా ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి కొన్ని ఆహారాలు తీసుకోవడం వలన మిమ్మల్ని కిడ్నీ సమస్య నుండి దూరంగా ఉంచుతాయి.అవి ఏంటి అంటే కొన్ని కూరగాయలలో ఒకటి అయినా క్యాబేజీలో సోడియం తక్కువగా ఉంటుంది మరియు కె, సి, బి6 విటమిన్లు ఉంటాయి. ఇందులో ఫైబర్ మరియు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. క్యాబేజీలో ఫైటోకెమికల్స్ ఉన్నాయి, ఇవి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో మరియు హృదయనాళ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.కిడ్నీ సమస్యలకు కొత్తిమీర గింజలు ఉత్తమమైన ఆహారం. కొత్తిమీరను నీళ్లతో మరిగించి తింటే కిడ్నీ సమస్యలు దరిచేరవు. ధనియాలు మూత్రాశయ సమస్యలను కూడా నయం చేస్తాయి.

క్రాన్‌బెర్రీ బెర్రీలలోని ఫ్లేవనాయిడ్స్ మరియు ఇతర పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్ శక్తిని కలిగి ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు UTIలను నిర్వహించడానికి మంచి ఆహారంగా చేస్తాయి. దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది

కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కాలీఫ్లవర్ గొప్ప కూరగాయ. విటమిన్ సి, కె మరియు బి పుష్కలంగా ఉండే క్యాలీఫ్లవర్ మూత్రపిండాల పనితీరును సులభతరం చేస్తుంది. కాబట్టి మీ వంటలో ఎక్కువ కాలీఫ్లవర్ ఉపయోగించండి. అంతేకాకుండా
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మరియు పప్పుధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. కిడ్నీ పనితీరు మరియు రక్షణ గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 2006లో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని అమలు చేశారు .ఈ విధంగా చిన్న చిన్న మార్పులతో మన కిడ్నీలను రక్షించుకోవచ్చును .






Untitled Document
Advertisements