చిలగడ దుంపలతో అదిరిపోయే టేస్టీ బొండాలు..

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 10:46 AM

చిలగడ దుంపలతో అదిరిపోయే టేస్టీ బొండాలు..

రోజు బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోసె తిని తిని బోర్ కొట్టిందా?అయితే వెరైటీగా మీ కుటుంబ సభ్యులకు కొత్తరకమైన బ్రేక్ ఫాస్ట్ చేయండి ఏంటి అంటే అయితే కొత్తగా చిలగడదుంపతో బొండాలు ప్రయత్నించండి. మంచి టేస్ట్ ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. బొండాలు చేయడం చాలా ఈజీ. ఈ తీపి బోండా చాలా రుచికరమైనది, పోషకమైనది కూడా. మీ ఇంట్లో ఒక్కసారి ఇలా చేస్తే తరచు అడుగుతారు. రుచి అంతటి అద్భుతంగా ఉంటుంది. దీన్ని చేయడానికి టైమ్ కూడా ఎక్కువగా పట్టదు. మంచి రుచిగా ఉంటాయి.

చిలగడదుంప బొండాలకు కావాల్సిన పదార్థాలు:
చిలగడదుంప - 1/4 కిలోలు
కొబ్బరి తురుము - 1/4 చిన్న కప్పు,
యాలకుల పొడి - 1/4 tsp,
ఉప్పు - 1 చిటికెడు,
చక్కెర - రుచికి అనుగుణంగా తీపి కోసం, వేయించడానికి అవసరమైన నూనె,
ఇడ్లీ పిండి - 1 కప్పు,
బియ్యప్పిండి - అవసరం మేరకు
చిలగడదుంప బొండా తయారీ విధానం:
ముందుగా ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. నీరు ఉడకడం మరుగుతుంటే అందులో చిలగడదుంప వేసుకోవాలి.
మూతపెట్టి ఉడకబెట్టాలి. తర్వాత తొక్క తీసి గిన్నెలో వేయాలి.ఇప్పుడు చెంచా లేదా చేతితో బాగా మెత్తగా చేసుకోవాలి.
తర్వాత కొబ్బరి తురుము, యాలకులపొడి, చిటికెడు ఉప్పు, కావలసినంత పంచదార వేయాలి.
తరవాత చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లేట్‌లో పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఇడ్లీ పిండి నీళ్ళుగా ఉంటే, పిండి కాస్త చిక్కగా కావడానికి కావలసినంత బియ్యప్పిండి వేయండి.
స్టవ్ పైన ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో వేయించడానికి కావల్సినంత నూనె పోయాలి.
నూనె వేడయ్యాక అందులో చిలగడదుంపల ఉండలు వేయాలి.
ఆ విధంగా ఒకేసారి 4-5 వేయండి. బాల్స్ పెట్టిన వెంటనే చెంచాతో కదపకుండా 1 నిమిషం తర్వాత తిప్పాలి. బంగారు రంగులోకి మారితే రుచికరమైన చిలగడదుంప బొండాలు రెడీ.అంతే చాల ఈజీగా ఉంది .

స్వీట్ పొటాటోలో ఫైబర్ ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సాయపడుతుంది. ఇది రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తుంది. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్నందున గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. దీనితో శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మేలు జరుగుతుంది. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఉన్న స్వీట్ పొటాటో తో ఈజీ గా పిల్లలు ఇష్టపడే విధంగా స్నాక్స్ గ కానీ , టిఫిన్స్ గా చేసుకొని తినవచ్చు .





Untitled Document
Advertisements