జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ దక్కిన అరుదైన గౌరవం

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 04:06 PM

జపాన్ లో  ఆర్‌ఆర్‌ఆర్‌ దక్కిన అరుదైన గౌరవం

భారతీయ సినిమా దర్శకుడిగా , సినీ రచయితగా పేరు పొందిన రాజమౌళి. అతను మొదటగా తెలుగు సినిమారంగంలో పని చేశాడు . ఈయన చేసిన సినిమాలలో ఒకటైన మగధీర అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించినది అంతేకాకుండా టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్గా నిలిచిన ఈగ, అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి , ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2 మొదలైన ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందాడు. ఇతన్ని భారతీయ చలనచిత్రరంగంలో ఉత్తమ దర్శకులలో ఒకడిగా తరచుగా పరిగణిస్తుంటారు . అలాంటి గొప్ప వ్వక్తి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్‌ సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కూడా రికార్డుల పరంపర కొనసాగడం, అరుదైన గౌరవాలు దక్కడం జరుగుతుంది. జపాన్ లో ఈ సినిమా 500 రోజులకు పైగా ప్రదర్శింపబడి అరుదైన రికార్డు ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవల రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు ఆయన కుటుంబ సభ్యులు జపాన్ కు వెళ్లారు. అక్కడ ప్రేక్షకులతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను చూడటం జరిగింది. అద్భుతమైన స్వాగతం రాజమౌళి టీం కి అక్కడ దక్కింది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ ను అక్కడి ప్రేక్షకులు ఓన్‌ చేసుకున్నారు.
తాజాగా రాజమౌళి ట్విట్టర్‌ లో ఆసక్తికర విషయాన్ని షేర్ చేశారు. 110 ఏండ్ల చరిత్ర ఉన్న తకరాజుకా అనే జపాన్ నాటక సంస్థ ఆర్‌ఆర్ఆర్ సినిమాను నాటకంగా తీర్చిదిద్దడం మాకు గర్వంగా ఉంది. జపాన్ ప్రేక్షకులు మా సినిమాను నాటకంగా స్వీకరించిందుకు కృతజ్ఞతలు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పట్ల మీ ప్రేమ మరియు మీ స్పందన చూస్తే గర్వంగా ఉంది. ఈ నాటకంను ప్రదర్శించిన అమ్మాయిల ఉత్సాహం మరియు వారి యొక్క ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే అంటూ కొన్ని వీడియోలను రాజమౌళి తన ఎక్స్ లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈయన పెట్టిన వీడియోలు, అన్ని కూడా వైరల్ అవుతున్నాయి . మన దేశంలోనే కాకుండా ఇతర దేశంలో ఇలాంటి స్పందన రావడం చాల గర్వంగా ఉంది జక్కన తెలిపాడు .





Untitled Document
Advertisements