ఫ్రిడ్జ్ శుభ్రం చేసేటప్పుడు ఈ టిప్స్ వాడితే ఎక్కువ రోజులు నీట్ గా ఉంటుందట!

     Written by : smtv Desk | Mon, Mar 25, 2024, 10:24 AM

ఫ్రిడ్జ్ శుభ్రం చేసేటప్పుడు ఈ టిప్స్ వాడితే ఎక్కువ రోజులు నీట్ గా ఉంటుందట!

ప్రస్తుతం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు . దాని వలన ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడానికి సమయం దొరకడం లేదు . మనకు ఏ సండే కానీ హాలిడే కానీ వచ్చిన రోజున క్లీన్ చేసుకోవలసిన పరిస్థితి వస్తుంది . అలాంటప్పుడు మనం చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించుకొని ఫ్రిజ్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం మంచిది. దీని వల్ల మీరు పెట్టే వస్తువులు తాజాగా ఉండడమే కాకుండా ఫ్రిజ్ కూడా నీట్‌గా ఎక్కువ రోజులు చక్కగా పనిచేస్తుంది. మరి క్లీన్ చేసినప్పుడు ఏ టిప్స్ ఫాలో అవ్వాలో చూదాం.

ఫ్రిజ్ ఫుడ్ స్టోరేజ్ కోసం వాడతారు. అయితే, కొన్నిసార్లు మిగిలిన ఫుడ్స్‌ని అందులో పెడతారు. వాటిని మళ్ళీ మరిచిపోతారు. అవి అలానే ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంటే అందులో బ్యాక్టీరియా, వైరస్‌లు పెరుగుతాయి. కాబట్టి, వాటిని ఎప్పటికప్పుడు చూసి తీసేయాలి. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.ఫ్రిజ్‌ని క్లీన్ చేసినప్పుడు ముందుగా పవర్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత అందులోని వస్తువులని తీసేయండి. ఎక్కువ రోజులు ఉన్న వస్తువులని పారేయండి. పాడైపోయిన కూరగాయలు, పండ్లని ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి.

ఇప్పుడు క్లీనింగ్ లిక్విడ్‌తో ట్రేలని తీసి క్లీన్ చేయండి. తర్వాత వాటిని బయట పెడితే అవి ఆరిపోయేలోపు లోపలి భాగాన్ని క్లీన్ చేయండి.ఈ విధంగా ఫ్రిజ్‌లోపల క్లీన్ చేసేటప్పుడు ముందుగా శుభ్రమైన తడి గుడ్డతో లోపలి భాగాన్ని క్లీన్ చేయండి. తర్వాత నిమ్మరసం, సోడం కలిపిన నీటితో మొండి మరకల్ని క్లీన్ చేయడం మంచిది.ఇలా చేయడం వలన ఎలాంటి మొండి మరకలు ఉన్న ఈజీగా తొలిగిపోతాయి . అంతేకాకుండా ఫ్రిజ్‌ని క్లీన్ చేయడానికి ముందుగా నీటిలో వెనిగర్ వేయండి. ఆ తర్వాత అందులో స్పాంజ్, గుడ్డని పెట్టి దాంతో ఫ్రిజ్‌ని క్లీన్ చేయండి. లోపల మొత్తం క్లీన్ చేయండి. తర్వాత ఆరనివ్వాలి.మనం ఓ సారి ఫ్రిజ్‌ని క్లీన్ చేశాక తిరిగి ఆ వస్తువులని ఫ్రిజ్‌లో పెట్టండి. ఫుడ్ ఐటెమ్స్‌ని గాలి చొరబడని కంటెయిన్సర్‌లో వేసి స్టోర్ చేయండి. పండ్లు, కూరగాయలు అన్నింటిని చక్కగా పెట్టేయండి.కనీసం ఫ్రిజ్‌ని రెండు, మూడు నెలలకి ఓ సారైన క్లీన్ చేయండి. ఇలా చేయడం వలన ఎలాంటి సమస్య రాకుండా ఫ్రిజ్‌చాల రోజుల వరకు వర్క్ చేస్తుంది . అంతేకాకుండా ఎలాంటి బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది .





Untitled Document
Advertisements