చాక్లెట్స్‌ ఇలా స్టోర్ చేస్తే ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయట

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 11:19 AM

 చాక్లెట్స్‌ ఇలా స్టోర్ చేస్తే  ఎన్ని రోజులైనా   ఫ్రెష్‌గా ఉంటాయట

చిన్న పిల్లలకు ఎక్కువగా ఇష్టమైనవి ఏమిటి అంటే చాక్లెట్స్ అని చెప్పవచ్చును . మనము ఎవరి ఇంటికి వెళ్లినప్పుడు కానీ, ఎవరైనా చిన్న పిల్లలు కనపడితే వారు అడిగేది చాక్లెట్స్ మాత్రమే . మన బంధువులు విదేశాల నుండి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేది కూడా ఈ చాక్లెట్స్. ఇవి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. అలా కొన్ని ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాయి . అయితే, కొంత మందికి ఎక్కువ చాక్లెట్స్ కొని పెట్టుకోవడం చేస్తువుంటారు . చాక్లెట్స్‌ని ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటిని సరిగ్గా స్టోర్ చేస్తే గనుక ఎలాంటి సమస్యలు రావు.

అంతేకాకుండ కొన్నిరకాలైన చాక్లెట్స్ తినడం వలన ఆరోగ్యానికి మంచిది . ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ లో 70 శాతం కొకో పౌడర్ ఉంటుంది . ఈ చాక్లెట్స్‌లో ఎక్కువగా ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ కావున అవి ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీసి సమస్యలకి కారణమవుతాయి. అలాగే, డార్క్ చాక్లెట్స్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపి కంట్రోల్ అవుతుంది. దీని వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్ సమస్యల నుంచి కాపాడుకోవచ్చు.డార్క్ చాక్లెట్స్ తింటే జ్ఞాపకశక్తి మెరుగ్గా మారుతుంది. దీని వల్ల బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది. దీనిని తింటే ప్రోస్టాగ్లాండిన్ ఉత్పత్తి తగ్గుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్స్ తింటే డోపమైన్, సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మానసిక సమస్యలు దూరమవుతాయి.

చాక్లెట్స్‌ని ఎక్కువగా తడి ఉన్న ప్రదేశంలో కాకూండా పొడిగా, చల్లగా ఉన్న ప్రదేశంలో స్టోర్ చేయండి. దీని వల్ల చాక్లెట్స్ కరిగిపోకుండా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి . మనం డార్క్ చాక్లెట్స్ కొని సరిగ్గా స్టోర్ చేయకపోతే త్వరగా పాడైపోతుంది. దీని వల్ల ఎన్నో సమస్యలొస్తాయి. అందుకే మనం డార్క్ చాక్లెట్స్ కొనే ముందు దాని ఎక్స్‌పైరీ డేట్ గురించి చెక్ చేయాలి. ఎక్కువ రోజులు టైమ్ ఉన్న చాక్లెట్స్‌ని మాత్రమే కొనడం మంచిది.
అదే విధంగా, కేవలం చాక్లెట్స్‌ని మాత్రమే సపరేటేగా పెట్టండి. అంతేకానీ, ఇతర ఫుడ్ ఐటెమ్స్‌తో కలిపి స్టోర్ చేయొద్దు. వీటి కవర్ ఎప్పుడు కూడా ఓపెన్ చేసి పెట్టొద్దు. దీని వల్ల వాటి చుట్టూ ఉన్న వాసనని చాక్లెట్స్ గ్రహించి చెడిపోతాయి. కాబట్టి, కవర్ క్లోజ్ చేసి మంచి ప్లేస్‌లో మాత్రమే వాటిని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి పెట్టండి. దీని వల్ల చాక్లెట్స్ ఎప్పటికీ తాజాగా ఉంటాయి. మీరు తిన్న తర్వాత మిగిలిన చాక్లెట్స్‌ని ఎంగిలి చేయకుండా చక్కగా కవర్ చేసి దాచండి. దీని వల్ల చాక్లెట్స్ ఎక్కువరోజులు నిలువ ఉంటాయి . ఈ విధంగా స్టోర్ చేయడం వలన పిల్లలకు ఎప్పుడైనా కావాలి అంటే తీసి ఇవ్వవచ్చును.

.





Untitled Document
Advertisements