కలిసిపోయిన నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆలియా నవాజ్

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 12:40 PM

కలిసిపోయిన నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆలియా నవాజ్

బాలీవుడ్‌ కి చెందిన ప్రముఖ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. ఈయన నేషనల్ స్కూల్ అఫ్ డ్రామాలో కోర్స్ పూర్తయ్యాక టివి సీరియల్స్ అవకాశాల కోసం ముంబైకు వెళ్ళాడు. ఆ సమయంలో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 'సర్ఫారోష్' చిత్రంలో నటించే అవకాశం రావడంతో
ఆ సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చాడు. ఆవిధంగా ఎన్నో సినిమాలు చేసి తాను చేసిన సినిమాల స క్సెస్ లతో మంచి పేరు దక్కించుకున్నాడు.కానీ నిజ జీవితంలో మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు . ఆయనకు కుటుంబ వ్యవహారం కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆయన భార్య తీవ్రమైన ఆరోపణలు చేసి కోర్టు వరకు వెళ్ళింది.
నవాజుద్దీన్‌ సిద్దిఖీ భార్య ఆలియా నవాజ్ ఆ మధ్య గృహ హింస కేసు పెట్టడంతో పాటు విడాకులకి సిద్ధం అయ్యింది. అంతే కాకుండా తన భర్త నవాజుద్దీన్‌ పై తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది. అతడి తీరును తీవ్రంగా విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అదే సమయంలో ఇద్దరు విడి పోబోతున్నారు.. విడి పోయారు అంటూ వార్తలు వస్తున్న సమయంలో పెద్ద ట్విస్ట్‌ ఇస్తూ ఆలియా నవాజ్ తన పిల్లలతో కలిసి నవాజుద్దీన్‌ సిద్ధిఖీ వద్దకు చేరింది. ఈ విషయాన్ని స్వయంగా ఇద్దరు కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేయడం జరిగింది. పెద్దలు కుదిర్చిన రాజీ మరియు పిల్లల కోసం నవాజుద్దీన్‌ మరియు ఆలియాలు మళ్లీ కలిశారు.. ఇద్దరు కలిసి పిల్లల కోసం జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నారు అంటూ వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరూ తమ ఈగోలను పక్కన పెట్టి కొత్త జీవితం ను ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు.చిన్న గొడవల కారణంగా విడిపోయి జీవితాలు పాడు చేసుకోవడం సరి కాదు. కనుక ఈసారి అయినా వీరి సంసార జీవితం సాఫీగా సంతోషంగా సాగాలని నవాజుద్దీన్ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తూ న్నారు . ఏది ఏమైనా పెళ్లి అయినా తర్వాత విడిపోయి పిల్లల జీవితాన్ని నాశనం చేయడం సరికాదు. ఇంతటితో వారి సమస్యలు దూరం అయి వారు ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని నెటిజనులు కోరుకుంటున్నారు .







Untitled Document
Advertisements