ప్రేమలు సినిమాతో అమాంతం పెరిగిన మమితా బైజు క్రేజ్'' కారణం అదేనట

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 12:53 PM

ప్రేమలు సినిమాతో అమాంతం పెరిగిన మమితా బైజు క్రేజ్'' కారణం అదేనట

అందమైన ముఖం , సొగసైన నడుముతో అందరిని అలరించే మమితా బైజు. ఈ అమ్మడు ఈమధ్య వచ్చిన ప్రేమలు సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో అమ్మడి నటన చూసి ఆడియన్స్ అంతా కూడా మమితా ప్రేమలో పడిపోతున్నారు. గత కొన్నేళ్లుగా చేసిన 15 సినిమాల దాకా రాని క్రేజ్ ఈ ప్రేమలు సినిమాతో సంపాదించుకుంది. ప్రేమలు మలయాళంలో సూపర్ హిట్ అని తెలియగానే తెలుగు లో రిలీజ్ చేశారు. రాజమౌళి కుమారుడు కార్తికేయన్ తెలుగు లో రిలీజ్ చేసే సరికి ఈ సినిమాకు కావాల్సినంత క్యాంపెయినింగ్ దొరికింది.

రాజమౌళి కూడా ప్రమోషన్స్ కి రావడం తో హెల్ప్ అయ్యింది. ప్రేమలు తెలుగులో కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇదే సినిమా రీసెంట్ గా తమిళంలో కూడా రిలీజైంది. ప్రేమలు సినిమాతో మమితా బైజు సౌత్ మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసింది. అయితే ప్రేమలు తర్వాత ఆమె చేసే సినిమాపై అందరి ఆసక్తి మొదలైంది. ఈలోగా మమితా నటించిన ఓ తమిళ సినిమా రిలీజైంది. తమిళంలో హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ గా తన పంథా కొనసాగిస్తున్న జివి ప్రకాష్ లీడ్ రోల్ లో నికేష్ ఆర్.ఎస్ డైరెక్షన్ లో తెరకెక్కిన రెబల్ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. మొన్ననే ప్రేమలు రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వడంతో రెబల్ మీద కొంత హైప్ క్రియేట్ అయ్యింది. లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. రెబల్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినా అందుకు తగిన కథ, కథనం ఆ సినిమాకు సెట్ అవ్వకపోవడంతో అది అంత గొప్ప టాక్ హిట్ రాలేకపోయింది

ప్రేమలు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన మమితా ఆ నెక్స్ట్ సినిమానే ఇలాంటి ఫలితం అందుకోవడం ఈ అమ్మడికి షాక్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే మమితా తో సినిమాలు చేసేందుకు తెలుగు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. కథల విషయంలో ఆచి తూచి అడుగులేయకపోతే మాత్రం మమితా కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంటుంది. రాజమౌళి అంతటి గొప్ప దర్శకుడు మమితాను సాయి పల్లవితో పోల్చాడు అంటే ఆ పేరుని ఈ అమ్మడు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతయినా ఉంది. రెబల్ లాంటి తప్పులు రిపీట్ అయితే మాత్రం మమితా కెరీర్ వెనకపడే ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా కానీ ఈ అమ్మడు తీసుకున్న ఇలాంటి నిర్ణయం మరెప్పుడు తీసుకోకుండా జాగ్రత్త పడాలి లేదు అంటే తాను ఆశించిన ఫలితం దక్కదు .





Untitled Document
Advertisements