కల్కి సినిమాలో విలన్ పాత్రలో ఎవరు?

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 02:52 PM

 కల్కి సినిమాలో విలన్ పాత్రలో ఎవరు?

టాలీవుడ్ లో ప్రభాస్ సరికొత్త సినిమాతో ముందుకు రావడం అందరికి తెలిసిన విషయం . యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ తోపాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, బిగ్ బి అమితాబ్ బచ్చన్, బోల్డ్ బ్యూటీ దిశా పటానీ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా విలన్ గా నటిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దీంతో మూవీపై మరింతగా ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. ఇంకా ఈ సినెమ ఏ రేంజ్ లో ఉహించుకోవడానికి అర్థం కావడం లేదు . అయితే ప్రభాస్ ను ఢీకొట్టే రోల్ లో కమల్ అంటే ఓ రేంజ్ లో అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. త్వరలోనే అప్డేట్ వస్తుందని కూడా ఆశించారు. కానీ ఇటీవల కమల్ బాంబు పేల్చారు. ఒక్కసారిగా ఆయన చేసిన కామెంట్స్ అందరినీ షాక్ కు గురిచేశాయి. ఇటీవల ఓ ఆంగ్ర పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ కల్కి సినిమా కోసం మాట్లాడారు. తాను కల్కి మూవీలో గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నట్లు తెలిపారు. విలన్ రోల్ కాదని స్పష్టం చేశారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు కమల్ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ను కొత్త కన్ఫ్యూజన్ లోకి నెట్టేశాయి. మరి ఈ సినిమాలో విలన్ గా ఎవరి నటిస్తున్నారన్న కొత్త ప్రశ్న తలెత్తింది

మరి ఈ ప్రశ్నకు కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కానీ, వైజయంతీ మూవీస్ టీమ్ కానీ స్పందిస్తుందో వేచి చూడాలి. ట్రైలర్ రిలీజ్ చేస్తే క్లారిటీ వస్తుందని నెటిజన్లతో పాటు ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 9న తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే అదే రోజు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మూవీ పోస్ట్ పోన్ పై మేకర్స్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే దృష్టి పెట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ రోల్ పోషిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ రివీల్ చేశారు. భవిష్యత్తులో కాశీ నగరానికి చెందినవాడిగా వర్ణించారు. హీరోయిన్ గా దీపికా పదుకొణె కనిపించనుండగా ఇటలీలో ప్రభాస్, దిశా పటానీ మధ్య రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేశారు. దీని బట్టి ఈ సినిమా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది . ఎప్పుడు పూర్తి అవుతుందో చూడాలి . ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎవరు కనిపిస్తారో తెలియలసింది ఉంది .





Untitled Document
Advertisements