చిన్న హీరోతో జత కట్టనున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 03:26 PM

చిన్న హీరోతో జత కట్టనున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్

టాలీవుడ్ లో సావిత్రి గారి జీవిత చరిత్రని రీమేక్ చేసిన సందర్భంలో ఆమె పాత్ర లో నటించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌.ఆ మహానటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్నది . ఆ సినిమా తర్వాత ఎన్నో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసిన కీర్తి సురేష్‌ కమర్షియల్‌ సినిమాల్లో కూడా నటించింది. సూపర్ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించిన కీర్తి సురేష్‌ చిన్న హీరోలకు కూడా జోడీగా నటించింది. గత ఏడాది మహేష్ బాబుకు జోడీగా సర్కారు వారి పాట సినిమాలో నటించిన కీర్తి సురేష్ కోలీవుడ్‌ లో పలువురు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ లో ఈమె ఇప్పుడిప్పుడే హీరోగా అడుగులు వేస్తున్న సుహాస్ కి జోడీగా నటించేందుకు కమిట్‌ అవ్వడం చాలా మందికి ఆశ్చర్యంను కలిగిస్తోంది.

కలర్ ఫొటోతో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న సుహాస్‌ ఆ తర్వాత చేసిన సినిమాలతో హీరోగా పర్వాలేదు అనిపించుకున్నాడు. అలాంటి సుహాస్‌ తో ఉప్పు కప్పురంబు అనే విభిన్నమైన కామెడీ ఎంటర్‌ టైనర్‌ ను చేసేందుకు కీర్తి సురేష్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉప్పు కప్పురంబు సినిమాలో కచ్చితంగా కీర్తి సురేష్ పాత్ర డామినేషన్‌ ఉంటుంది. అయినా కూడా సుహాస్ వంటి చిన్న హీరోతో జత కట్టడం అనేది చాలా పెద్ద సాహసం అంటూ స్వయంగా ఆమె అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ విషయమై సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. నటి అన్నప్పుడు అన్ని రకాల సినిమాలు చేయాలి, అన్ని రకాల కథలను చేయాలి. ఇక నటిగా నిరూపించుకునేందుకు కాన్సెప్ట్‌ ను చూడాలే కానీ అందులో నటిస్తున్న నటీ నటులను కాదు. కనుక కీర్తి సురేష్ నిర్ణయం కరెక్టే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా ఎలా ఉంటుందో ? ఏ రేంజ్ లో ఉంటుందో ? చూడడానికి ఇంకా కాస్త సమయం పట్టేటట్లు ఉంది . ఏది ఏమైనా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి కామెడీ సినిమాగా ఉంటుంది అనడంలో సందేహం లేదు .







Untitled Document
Advertisements