అరచేతుల చర్మం ఎండిపోయి పొట్టు ఊడిపోతుందా? ఇదిగో పరిష్కారం

     Written by : smtv Desk | Wed, Mar 27, 2024, 10:44 AM

అరచేతుల చర్మం ఎండిపోయి పొట్టు ఊడిపోతుందా? ఇదిగో  పరిష్కారం

మనలో చాలా మందికి చేతులు ఎండిపోయి పొట్టు రాలినట్లు కనిపిస్తాయి. సాధారణంగా ఈ సమస్య ఎక్కువగా చిన్న పిల్లలకు వారి చేతులపై చర్మం పగిలి పొరలా ఊడిపోవడం చూస్తుంటాం.దీని వలన అంత నొప్పిగా, ఇబ్బందిగా లేకపోయినప్పటికి ఈ సమస్య అంత తేలికగా పోదు. చూడడానికి ఏదో రోగం మాదిరిగా ఉంటుంది పిల్లలు బడికి వెళుతుంటారు కాబట్టి తోటి పిల్లలు వారిని ఏడిపిస్తుంటారు . దాని వలన చాల ఇబ్బంది పడుతుంటారు . ఏది పెద్ద సమస్య ఏమి కాదు . దీని కోసం మూడు నాలుగు రోజుల పాటు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటేనే పోతుంది. అయితే అరచేతులపై చర్మం ఊడిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూడండి .

స్కిన్ పీలింగ్ అంటే ఏమిటి?: ఎపిడెర్మిస్ అని పిలువబడే మీ బయటి పొరను శరీరం తొలగించినప్పుడు స్కిన్ పీలింగ్ ఏర్పడుతుంది. పీలింగ్ లేదా ఫ్లేకింగ్ అనేది మీ చర్మాన్ని ఎలాంటి నష్టం నుండి నయం చేసే ప్రక్రియ. పర్యావరణ కారకాలు, చర్మ పరిస్థితులు, అలెర్జీలు, అంటువ్యాధులు లేదా కొన్ని వ్యాధులు మరియు చికిత్సల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది.

పీలింగ్ ఎలా ఉంటుంది?: మీ చేతుల్లో కనిపించే ఎపిడెర్మిస్‌ని పీలింగ్ స్కిన్ అంటారు. ఇది మీ చర్మం యొక్క బయటి మరియు సన్నని పొర. మీ ఎపిడెర్మిస్ సన్నగా ఉన్నప్పటికీ, బ్యాక్టీరియా మరియు జెర్మ్స్ నుండి మీ శరీరాన్ని రక్షించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ప్రతిరోజూ చనిపోయే వేలాది కణాల స్థానంలో కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది..

స్కిన్ పీలింగ్ కారణాలు:
చేతులు పదేపదే పొట్టు ఊడిపోవడానికి పొడి చర్మం, సన్ బర్న్, సోరియాసిస్, కెమికల్ సబ్బులు, క్రీములు, సీజనల్ మార్పులు, అలర్జీలు, దురద వంటివి చేతులపై చర్మం పొట్టు రాలిపోవడానికి కారణాలు. అంతే కాకుండా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, డిసీజ్ ఇన్ఫెక్షన్, పోషకాహార లోపం వంటివి కూడా చర్మ సమస్యలను కలిగిస్తాయి.
చర్మం పగిలి పొరలా ఊడిపోకుండా ఉండటానికి పరిష్కారం ఏమిటి? చర్మం పొడిబారడం వల్ల పొలుసులు వచ్చే అవకాశం ఉంటే, చేతులను గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. దీంతో చేతులు మృదువుగా మారుతాయి. పీలింగ్ తొలగించబడుతుంది.
విటమిన్-E నూనెను చేతులకు మసాజ్ చేయడం వల్ల తేమను నిలుపుకోవడంతోపాటు చేతులు మెరుస్తాయి.
అలోవెరా : అలోవెరా జెల్‌ను మీ చేతులకు అప్లై చేసి మసాజ్ చేసి, ఆరబెట్టి, గోరువెచ్చని నీటితో కడిగి, కొబ్బరినూనె రాయండి ఇలా చేయడం వలన చేతులు మెరుస్తాయి.ఈ విధంగా మన కిచెన్ లో దొరికే ఆయిల్ ఉపయోగించుకొని పొట్టు పోయిన చేతులకు ఉపశమనము కలింగించుకోవచ్చును . ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంది అంటే అప్పుడు స్కిన్ స్పెసలిస్ట్ ను సంప్రదించి మెడిసిన్ వాడాలి .








Untitled Document
Advertisements