చిన్న పిల్లలలో ఉండే తెల్ల జుట్టు సమస్యకు ఈ జ్యూస్‌ తో చెక్

     Written by : smtv Desk | Wed, Mar 27, 2024, 10:57 AM

చిన్న పిల్లలలో ఉండే తెల్ల జుట్టు సమస్యకు ఈ జ్యూస్‌ తో చెక్

ఈ మధ్య కాలంలో చిన్న వయస్సు లోనే జుట్టు నెరసిపోవడం కూడా ఒక ప్రధాన సమస్య.దీనికి హార్మోన్ల మార్పులు, జీవనశైలిలో మార్పులు కారణము అవుతున్నాయి . ఈ విధంగా జుట్టు అకాలంగా తెల్లబడటాన్ని నివారించడానికి ఎటువంటి చికిత్స లేనప్పటికీ, కొంతకాలం పాటు దీనిని వాయిదా వేయవచ్చు. కొన్ని రకాల రసాలు తాగడం వలన ఈ సమస్య తొందరగా రాకుండా చేసుకోవచ్చును . ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం .

పాలకూర రసం:
ఐరన్, విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉండే పాలకూర రసాన్ని ఉపయోగించడం వలన ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు నెరసిపోకుండా చేస్తుంది. ఐరన్ లోపం లేకుండా ఉంటే మీ జుట్టు అందంగా ఉంటుంది. కాబట్టి పాలకూరలోని ఐరన్ కంటెంట్ జుట్టు నెరసిపోకుండా చేస్తుంది.
క్యారెట్:
క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. చర్మంలో నూనె ఉత్పత్తికి విటమిన్ ఎ ముఖ్యమైనది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొడిబారకుండా చేస్తుంది. ఇది అకాల పిగ్మెంటేషన్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది.
ఉసిరి:
ఉసిరి జ్యూస్ విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలం. జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడం, జుట్టు తెల్లబడటాన్ని నివారించడానికి సాయపడుతుంది. ఇది ఆయుర్వేద వైద్యంలో ప్రధానమైనది. ఇందులోని యాసిడ్ జుట్టు నెరసిపోవడాన్ని నివారిస్తుంది. హెయిర్ రూట్ గట్టిగా మారేలా చేస్తుంది.వీటిని అన్నింటిని మన ఆహారం లో భాగంగా చేసుకొని డైలీ పిల్లలకు చిన్న నాటినుండి తినిపించడం వలన వారిని తెల్ల జుట్టు రాకుండా చేసుకోవచ్చును .





Untitled Document
Advertisements