ఈ మహిళ గ్యాస్‌ సేవింగ్‌ ఎలా చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!

     Written by : smtv Desk | Wed, Mar 27, 2024, 02:43 PM

ఈ మహిళ గ్యాస్‌ సేవింగ్‌ ఎలా చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!

ఇప్పుడున్న పరిస్థితిలో మహిళలు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఇటు వంట పని , అటు ఉద్యోగం , అంటూ అనేక రంగాలలో దూసుకుపోతున్నారు , అయినా మధ్య తరగతి మహిళలకు కొన్ని కష్టాలు తప్పడం లేదు . ప్రస్తుతం పెరిగిన ధరలను బట్టి చూస్తే గ్యాస్ సిలిండర్ రేట్స్ చాల పెరిగాయి . దాని వలన మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు .గ్యాస్‌ ఆదా చేసే ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్‌ చెయ్యడం లేదు . అయినా ఇంట్లో అందరికీ కావాల్సినవి అమర్చి పెట్టే క్రమంలో గ్యాస్‌ ఆదా చేయలేక సతమతమవుతుంటారు మహిళలు. పోనీ కట్టెల పొయ్యి వంటివి ఏమైనా ట్రై చేద్దామా అంటే అంతా అపార్ట్‌మెంట్లో నివాసం ఉండే పరిస్థితి. అలాంటప్పుడూ ఇది అస్సలు కుదరదు. కానీ ఒక మహిళ గ్యాస్‌ని ఆదా చేయడానికి ఒకేసారి రెండు వంటకాలు చేసి శభాష్‌ అనిపించుకుంటుంది . ఆమె ఎలా చేసిందో చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. అవున్నా ఇలా కూడా చేసి , గ్యాస్‌ ఆదా చేసుకోవచ్చా అని అనుకుంటారు.
అసలు ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి ఓ మహిళ గ్యాస్‌ ఆదా చేయడానికి ఓకే స్టవ్ మీద రెండు రకాలైన వంటలు చేస్తూ అందరిని . ఆశ్చర్యపరిచింది . ఆ మహిళ టిఫిన్ కి పూరీలు, అందులోకి బంగాళదుంప కూర చేయాలనుకుంది. అందుకని ముందుగా ఓ గిన్నేలో బంగాళ దుంపలను ఉడకబెట్టింది. ఆ ఆవిరిపైనే వేడితోనే పూరీలను కూడా చక్కగా ప్రీపేర్‌ చేసేంది. ఈ ఐడియాని వింటుంటే ఆమెది ఏం తెలివి అంటున్నారు . ఆమె ఆలా చేసింది అనుకుంటున్నారా మీరే చూడండి ఎలా చేసిందో

ఏం లేదండి ఓ స్టీల్‌ గిన్నేలో బంగాళ దుంపలు పెట్టింది. దానిపై ఓ మూకిడి పెట్టి నూనె పోసి చక్కగా పూరీలను వేయించింది. ఆ బంగాళ దుంపల ఆవిరిపైనే పూరీలను ప్రీపేర్‌ చేసేసింది అంతే. ఓహో ఇలా కూడా గ్యాస్‌ ఆదా చేయొచ్చా..!. ఇంతవరకు మాకు ఇలాంటి ఐడియా రాలేదబ్బా అని అనుకుంటున్నార , ఏమి లేదు ఏది అయినా చేయాలి అనే తపన ఉంటె సాధించవచ్చు. మీరు కూడా ఇలాంటి ఐడియా లు ఫాల్లో అవుతూ గ్యాస్ ఆదా చేయండి మరి.





Untitled Document
Advertisements