హైదరాబాద్ నుంచి ఊటీ ట్రైన్ ట్రిప్ ప్లాన్ చేసుకొండిలా..

     Written by : smtv Desk | Wed, Mar 27, 2024, 03:32 PM

హైదరాబాద్ నుంచి ఊటీ ట్రైన్ ట్రిప్ ప్లాన్ చేసుకొండిలా..

సమ్మర్‌ స్టార్ట్ అయినది అంటే చాల మంది పిల్లలకు హాలిడేస్ వస్తాయి కావున ఎక్కడికైనా టూర్ వెళ్లే ప్రయత్నం చేస్తూఉంటారు . అయితే ఈ వేసవి కాలం లో ఎక్కువ మంది ప్లాన్ చేసే ట్రిప్‌లలో ఊటీ ఒకటి. హైదరాబాద్ నుంచి కూడా ఊటీకి ఎంతో మంది పర్యాటకులు వెళ్తుంటారు. ఐతే అక్కడికి చేరుకోవాలంటే కొంత మంది సొంత వాహనంలో వెళ్తూ ఉంటారు . లేదంటే రైలు, బస్సు, వాయు మార్గాల్లో వెళ్తూ ఉంటారు .

కానీ సొంత వాహనం, విమానం, బస్సుల్లో వెళ్లాలంటే చాలా ఖర్చవుతుంది. రైలులో వెళ్తే ఖర్చు తక్కువగా వస్తుంది. కానీ హైదరాబాద్ నుంచి ఊటీకి డైరెక్టు రైళ్లు ఉండవు. మరి దీని కోసం సికింద్రాబాద్ నుంచి ఊటీ వరకు రైలు లో ఎలా వెళ్లాలో తెలుసుకుందాం .

హైదరాబాద్ నుంచి ఊటీకి రైలులో వెళ్లాలంటే ముందుగా కోయంబత్తూరు వరకు వెళ్లాలి. శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తే కోయంబత్తూరు వరకు వెళ్లొచ్చు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది . మొదటిసారిగా ట్రైన్ ఎక్కిన వాళ్లకి హల సరదాగా ఉంటుంది .

సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12:20కి బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 07:57కి కోయంబత్తూరు చేరుకుంటుంది. ఇక కోయంబత్తూరు నుంచి మెట్టుపాళ్యం వరకు మరో రైలులో వెళ్లాల్సి ఉంటుంది. కోయంబత్తూరు నుంచి మెట్టుపాళ్యం చాలా దగ్గరగా ఉంటుంది.అక్కడికి గంటలో వెళ్లిపోవచ్చు.

నీలగిరి ఎక్స్‌ప్రెస్, తిరునల్వేలి-మెట్టుపాళ్యం స్పెషల్ వంటి రైళ్లలో కోయంబత్తూరు నుంచి మెట్టుపాళ్యం చేరుకోవచ్చు . ఈ నేపథ్యంలో మీరు కోయంబత్తూరులో దిగిన ఈషా ఫౌండేషన్, ఇతర పర్యాటక స్థలాలను చూసి.. మరుసటి రోజు ఉదయం రైల్లో మెట్టుపాళ్యం వెళ్లొచ్చు.

ఇక మెట్టుపాళ్యం నుంచి నేరుగా ఊటీకి వరకు టాయ్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. నీలగిరి అందాలను వీక్షిస్తూ.. కొండకోనల్లో ప్రయాణిస్తూ.. ఊటీకి చేరుకోవచ్చు. మెట్టుపాళ్యంలో ఉదయాన్నే 07:10కి ఊటీ వెళ్లే రైలు ఉంటుంది. ప్రయాన సమయం దాదాపు 5 గంటలు మీరు ఫ్యామిలి తో వెళ్ళితే మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు .

ఒకవేళ కోయంబత్తూరు నుంచి రైళ్లో వెళ్లేందుకు సమయం లేకున్నా ట్రైన్స్‌ లేకున్నా.. బస్సులో మెట్టుపాళ్యం వరకు చేరుకొని.. అక్కడి నుంచి టాయ్ ట్రైన్‌లో ఊటీకి వెళ్లొచ్చు. ఊటీలో హోటల్‌లో స్టే చేసి అక్కడి చుట్టు పక్కల అందాలను ఆస్వాదించవచ్చు. ఒకవేళ మీరు మీ సొంత వాహనం వెళ్లిన ఇంత ఎంజాయ్ చేయరు . అందుకే మీరు ఊటి వెళ్లే ప్లాన్ లో ఉంటే ట్రైన్ లో వెళ్లడానికి ట్రై చేయండి హ్యాపీగా వెళ్ళవచ్చు .







Untitled Document
Advertisements