పుట్టగొడుగులతో గుండె ఆరోగ్యం పదిలం..

     Written by : smtv Desk | Thu, Mar 28, 2024, 09:32 AM

పుట్టగొడుగులతో గుండె ఆరోగ్యం పదిలం..

మష్రూమ్స్, లేదా పుట్టగొడుగులు మంచి ఆహార పదార్థాలు వీటితో రకరకాలైన వంటకాలను తయారు చేసుకోవచ్చును . ఈ మధ్య కాలంలో వీటినే ఎక్కువగా ఇంట్లో కూడా పండించి వ్యాపారం చేస్తున్నారు . ఇలా చేయడం వలన చాల మంది ఆర్థికంగా లాభపడుతున్నారు . అంతేకాకుండా వీటితో రకారకాలైన ఫాస్ట్‌ఫుడ్, సంప్రదాయ వంటలు చేయడం వలన ప్రజలు వాటి మోజులో పడిపోతున్నారు . వీటిని రెస్టారెంట్లు, ఇళ్లలో కూడా చేసుకుంటారు. ఇదో ఓ రకమైన ఫంగస్ జాతి మొక్క. పాశ్చాత్య దేశాల్లో వీటిని వెజిటేరియన్ జాబితాలో చేర్చితే, దక్షిణ భారత దేశంలో మాత్రం వీటిని మాంసాహారం కింద భావిస్తారు.

పుట్టగొడుగుల్లో తక్కువ కెలరీలు:
పుట్టగొడుగుల్లో పోషకాలు ఉండడమే కాదు. వీటిలో చాలా తక్కువ కెలరీల (low calories) ఆహారం.ఉంటుంది . కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుస్తుంది . అన్ని వెరైటీల మష్రూమ్స్ లోనూ కెలరీలు చాలా తక్కువగా ఉంటాయని తెలుస్తుంది . డైటరీ ఫైబర్ (dietary fibber) ఇందులో పుష్కలంగా ఉండటమే కాదు ఇతర పోషకాలైన ప్రొటీన్లు, C, B, Dవిటమిన్లు, కాపర్, పొటాషియం, సెలీనియం, ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి.

మష్రూమ్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమమైన నిర్ణయమని ఈ పోషకాలే చెబుతున్నాయి. యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-క్యాన్సర్ బెనిఫిట్లను పొందాలంటే మష్రూమ్స్ సరైన ఆహారం. అంతేకాదు బీటా-గ్లూకాన్స్ ఎక్కువగా ఉంటాయి కనుక, పుట్టగొడులతో చేసిన ఆహారం తింటే మీకు ఇన్ని పోషకాలు ఒంట్లోకి చేరతాయని పోషకాహార నిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు.

ఇమ్యూనిటీ బూస్టర్:
పోషకాలు మెండుగా ఉన్న పుట్టగొడుగులు సమృద్ధిగా తింటే మీ ఒంట్లో రోగనిరోధక శక్తి (immunity) బాగా పెరుగుతుంది. మష్రూమ్స్ లోని యాంటీఆక్సిడెంట్లు, పైటోకెమికల్స్ కారణంగా యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు సీజనల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టేందుకు సహకరిస్తాయి. అంతేకాదు తరచూ అనారోగ్యం బారిన పడకుండా చేస్తాయి. బరువు తగ్గాలంటే (weight loss) మష్రూమ్స్ తినండి, మంచి పోషకాలు అందుతూనే ఆరోగ్యంగా ఉంటూ బరువు ఈజీగా తగ్గొచ్చు.

గుండె జబ్బులకు చెక్:
పుట్టగొడుగులంటే లీన్ ప్లాంట్ ప్రొటీన్ (plant protein) కాబట్టి దీంతో కొవ్వు సంబంధిత సమస్యలు రావు. తక్కువ కేలరీలు, తక్కువ శాతం కొవ్వు ఉన్న మష్రూమ్స్‌తో హృద్రోగాలు రాకుండా మీ గుండెను కాపాడుకోవచ్చు. వీటిలో ఉన్న గ్లూటేమేట్ రిబోన్యూక్లియోటైడ్స్ వల్ల వెరైటీ ఫ్లేవర్ వస్తుంది, అంతే కాదు దీంతో పుట్టగొడుగుల్లో సహజంగా ఉన్న ఉప్పు మీ శరీరానికి మంచి చేస్తుంది. అందుకే వీటిని వండేందుకు మీరు ఉప్పు ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ సహజసిద్ధమైన ఉప్పుతో బీపీ తగ్గి, గుండె పనితీరు మెరుగుపరుడుతుంది. ఈ విధంగా గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు.

కాగ్నిటివ్ ఫంక్షన్:
మెదడు పనితీరును క్రమబద్ధీకరించే ముఖ్యమైన 2 యాంటీఆక్సిడెంట్లు మష్రూమ్స్‌లో ఉంటాయి. ఎర్గోథైనిన్, గ్లూటాథైన్ ఉన్న పుట్టగొడుగులు మీ మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది. దీంతో మెదడులోని కణజాలాలు చురుకై, వృద్ధాప్యం కారణంగా తగ్గే జ్ఞాపక శక్తి వంటివాటికి బ్రేక్ వేస్తుంది. డిమెన్షియా, పార్కిన్ సన్స్, అల్జీమర్స్ ను తగ్గించే శక్తి పుట్టగొడుగులకు ఉన్నట్టు తెలుస్తుంది

ఎముకల పటుత్వం:
ఎముకల పటుత్వం పెంచే గుణాలున్న మష్రూమ్స్ చాలా రుచిగా కూడా ఉంటాయి. డీ విటమిన్, క్యాల్షియం, పొటాషియం, పాస్ఫరస్ వంటి పోషకాలున్న పుట్టగొడుగులు ఎముకల్లో దృఢత్వాన్ని పెంచుతుంది. ఆస్టియోపొరాసిస్, ఎముకల నొప్పి, కండరాల బలహీనత వంటి సమస్యలకు ఇదిమంచి ఔషధంగా పనిచేస్తుంది

అజీర్తికి విరుగుడు:
ప్రీబయాటిక్స్ (prebiotics) ఎక్కువగా ఉన్న పుట్టగొడుగులతో జీర్ణక్రియలు వేగవంతం అవుతాయి. పేగుల్లో అవసరమైన మంచి బ్యాక్టీరియా, ఫంగస్‌ను వృద్ధి చేసి, ఈజీగా జీర్ణమయ్యేలా చేసే చేస్తుంది. పేగుల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అజీర్ణం వంటివాటికి మంచి విరుగుడుగా పనిచేసే పుట్టగొడుగుల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కనుక మలబద్ధకం సమస్య పోతుంది . కొంత మందికి పుట్టగొడుగులను తినడం అంటే ఇష్టపడరు కానీ దీనిలో ఉన్నటువంటి , విటమిన్స్, మినరల్స్ ను దృష్టిలో పెట్టుకొని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది . వీటితో చాల వైరటీ ఫుడ్ చేసుకోవచ్చును.





Untitled Document
Advertisements