ఇంట్లో క్రిమి కీటకాల బెడద ఎక్కువ ఉంటే ఇలా చేయండి..

     Written by : smtv Desk | Thu, Mar 28, 2024, 09:50 AM

ఇంట్లో క్రిమి కీటకాల బెడద  ఎక్కువ ఉంటే ఇలా చేయండి..

సాధారణంగా ఇండ్లలో వాతావరణం మారుతున్న కొద్దీ కొన్ని రకాలైన కీటకాలు రావడం మొదలవుతుంది. దీని వలన చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే చాల ఇబ్బంది పడతారు . దాని కోసం వాటిని ఇంట్లోకి రాకుండా చేయడానికి, ఇంట్లోంచి పోగొట్టడానికి చాల ప్రయత్నాలు చేస్తారు . కొన్ని సార్లు ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఏదో ఒక మూలన బొద్దింకలు, చీమలు, దోమలు లేదా మరేదైనా పురుగులు ఉంటాయి. కానీ ఇవన్నీ ఎన్నో వ్యాధులకు కారణమవుతాయి. నిజానికి ఇవన్నీ పర్యావరణానికి చాలా అవసరం. కానీ ఇండ్లలో ఉంటే లేనిపోని రోగాలు వస్తాయి. ఇల్లు కూడా నీట్ గాఅనిపించదు. అందులోనూ ఈగలు ఎన్నోరోగాలను మోసుకొస్తాయి. అందుకే వీటిని ఇంట్లోకి రానీయకూడదు. అందుకే చాలా మంది ఇంట్లో పురుగులు ఉండకుండా పురుగుల మందు పిచికారి చేస్తుంటారు. దీనివల్ల కీటకాలన్నీ పారిపోతాయి. కానీ మన ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది. అలాకాకుండా కిచన్ లో లభించే వాటితో సింపుల్ టిప్స్ ను ఫాలో అయితే మీ ఇంట్లోకి ఏ ఒక్క కీటకం కూడా రాదు. అవి ఏంటో చూదాం .

ప్రతి ఒక్కరి వంటింట్లో వెల్లుల్లి ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీన్ని ఫుడ్ లోనే కాకుండా కీటకాలను తరిమికొట్టడానికి కూడా వాడుకోవచ్చును .

1 వెల్లుల్లి రెబ్బ, 1 చిన్న ఉల్లిపాయను తీసుకుని తురమండి. లేదా ప్యూర్ గా తయారు చేయండి. ఇప్పుడు దీంట్లో 1 టీస్పూన్ నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపండి. తర్వాత దీంట్లో 1 లీటర్ నీళ్లు పోసి కనీసం 2 గంటల పాటు అలాగే ఉంచండి. 2 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్ లో పోయండి. దీంట్లో మీరు కావాలనుకుంటే 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను కూడా కలప వచ్చు . కానీ ఆలివ్ నూనె కొన్ని రకాల కీటకాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పురుగులున్న ప్రదేశంలో స్ప్రే చేయండి. రాత్రిపూట చల్లి ఉదయాన్నే ఇంటిని భాగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అయితే పిల్లలు ఇక్కడ ఆడుకోకుండా చూడాలి.
చాలా మటుకు ఈగలు ఫుడ్ దగ్గరే ఎక్కువగా వాలుతుంటాయి. ఇవి వాలకుండా ఉండాలంటే ఒక గాజు గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్, 2 టీస్పూన్ల డిష్ వాష్ లిక్విడ్ ను బాగా కలపండి. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ వాసన వస్తుంది. దీంతో కీటకాలు దాని దగ్గరకు వస్తాయి. అయితే డిష్ వాష్ ద్రవం రసాయనం అవి అక్కడే చనిపోతాయి. ఈ పద్ధతి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

అయితే మీరు వీటిని చాలా సులువుగా బయటకు పోగొట్టే మార్గం ఒకటి ఉంది.బోరాక్స్, బేకింగ్ సోడాతో ఇవి ఇంట్లో ఒక్క క్షణం లేకుండా చేయొచ్చు. ఇందుకోసం బోరాక్స్, బేకింగ్ సోడాను బ్రెడ్ ముక్కలతో మిక్స్ చేసి చీమలు, బొద్దింకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఉంచండి. ఇది మనుషులకు ప్రమాదకరం కాదు. కానీ ఇది బొద్దింకలు చనిపోయేలా చేస్తుంది. కానీ ఇది ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులకు చాలా ప్రమాదకరం. అందుకే ఇక్కడికి అవి రాకుండా చూసుకోవాలి.

ఎండాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని ఒక సింపుల్ పద్దతిలో ఇంట్లోకి రాకుండా చేయొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా థాయ్ లెమన్ గ్రాస్ ను నీటిని కలిపి 24 గంటలు అలాగే ఉంచాలి. తర్వాత దీన్ని స్ప్రే బాటిల్లో పోసి ఉపయోగించాలి. అయితే మీరు వీటిని ఉపయోగించుకునే ముందు చేతులకు , కాళ్లకు , తగలకుండా జాగ్రత్తగా ఉండాలి . ఇలాంటి చిట్కాలను ఉపయోగించుకొని వీటి బెడద నుంచి దూరంగా ఉండవచ్చును .






Untitled Document
Advertisements