ఒంటికి మట్టి పూసుకుంటే ఇన్ని లాభాలా!

     Written by : smtv Desk | Fri, Mar 29, 2024, 10:08 AM

ఒంటికి మట్టి పూసుకుంటే ఇన్ని లాభాలా!

పుట్టిన తర్వాత మట్టిలో కలిసిపోవాలి అంటారు కదా. అవును నిజమే ఇది. పూర్వకాలంలో ఎక్కువగా మట్టిలో తిరిగే వారు అందుకే వారికీ ఎలాంటి రోగాలు వచ్చే వి కావు .అందు వలన ఇతర దేశాలలో ప్రజలు పిల్లలను ఎక్కువగా మట్టిలోనే ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు .
ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా సిటీలలో పిల్లలను ఆడించడానికి పార్కులకు ఇతర ఆటలలో ప్రోత్సహిస్తునారు . ఎందుకంటే ఈ మట్టిలో మనిషికి మేలు చేసే పోషకాలు ఉన్నాయి. మట్టిని ఒళ్లంతా పూసుకొని 45 నిమిషాల పాటు అలాగే ఉండాలి. తర్వాత స్నానం చేస్తే 64 రకాల చర్మవ్యాధులకు చెక్ పెట్టవచ్చన్నారు. మట్టి స్నానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తుంది .
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో నివాసముంటున్న యోగా గురువు ప్రభాకర్. గత 45 సంవత్సరాలుగా యోగా చేస్తున్నారు. ఎంతోమందికి యోగాలో శిక్షణ ఇస్తున్నారు. 20 కి పైగా కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఇస్తూ తన అనుభవంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చికిత్స కూడా అందిస్తున్నారు.
ప్రతి సంవత్సరం నాలుగు సార్లు మట్టి స్నానం కార్యక్రమం ఉంటుంది. తన యోగా కేంద్రాల్లో యోగా నేర్చుకునే వారంతా మట్టి స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మట్టిలో మనిషికి మేలు చేసే చాలా గుణాలు ఉన్నాయి. పుట్ట మట్టి, ముల్తాన్ మట్టి, పసుపు, గోమూత్రం, గోవు పేడ ఇలా అన్నింటిని కలిపి మట్టిని మెత్తగా కలుపుకుంటారు.


64 రకాల చర్మ వ్యాధుల నివారణ ఈ మడ్ బాత్ లో ఉందన్నారు. మట్టిని బాడి అంతటారాసుకుని 45 నిమిషాల పాటు ఉంటే బాడిలోని వేడిని కూడా తగ్గిస్తుంది. చర్మవ్యాధులు కూడా పోతాయి. పిల్లలు కాని వారికి సైతం పిల్లలవుతారు. నాభి పైన మట్టిని పూసుకుని 45 నిమిషాల పాటు ఇలా 45 రోజులు చేస్తే కణాల సంఖ్య పెరిగి పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. మోకాళ్ళ నొప్పుల ఉన్నవారు కూడా మట్టి పాట్టిలు మోకళ్లపై వేసుకుంటే పెయిన్ కిల్లర్ వేసుకున్నంత రిలిఫ్ ఉంటుందని యోగా గురువు ప్రభాకర్ వివరించారు. యోగా ద్వారా మనిషి సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆయన తెలిపారు.ఇన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నటువంటి మట్టి మన దేశంలో ఉండడం గొప్ప గర్వకారణం .






Untitled Document
Advertisements