చియా సీడ్స్‌తో గుండె ఆరోగ్యం పదిలం..

     Written by : smtv Desk | Fri, Mar 29, 2024, 10:49 AM

చియా సీడ్స్‌తో గుండె ఆరోగ్యం పదిలం..

చియా గింజలు పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఇవి నలుపు, తెలుపు, బూడిద రంగులో రకరకాలుగ ఉంటాయి. ప్రోటీన్స్ ఖనిజలవనాలు, మంగనీస్, పాస్పరస్ అధికంగా ఉంటాయి. సులువుగా జీర్ణం అవటం మరియు ఆహార పదార్థాలలో కలుపుకునే వీలు ఉండటం వలన వీటిని ఎక్కువగా వాడుతారు. ఇందులో ప్రోటీన్, డైటరీ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సహా పోషకాలలో చాలా సమృద్ధిగా ఉంటాయి. చియా విత్తనాలు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నవే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్, ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించేందుకు గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు సహకరిస్తాయి. ఇవి బహుముఖమైనవి. సమతుల్య ఆహారంగా వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. వీటిని రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి .


చియా సీడ్ పుడ్డింగ్ :
చియా విత్తనాలను రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. తర్వాత ఇవి కాస్త జిగురుగా ఉబ్బి తయారవుతాయి. వీటిని సలాడ్స్, డెజర్ట్స్ తో కలిపి ఎలా అయినా తీసుకోవచ్చు. స్వీటెనర్ తో చియా గింజలను కలిపి రుచి కోసం రాత్రిపూట ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేసుకోవడం వలన అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి .

పెరుగు నుంచి యాపిల్ సాస్ వరకూ అన్ని రకాలుగా దీనిని తీసుకోవచ్చు. అలాగే స్మూతీస్ లో కూడా మంచి కాంబినేషన్ అవుతుంది.
ఫైబర్, ప్రోటీన్ కోసం ఇష్టమైన స్మూతీకి ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు సరిపోతాయి.చియా గింజలను మెత్తని పండ్లతో కలిపి మంచి రుచికరమైన జామ్ కూడా చేయవచ్చు. చిక్కబడే వరకూ ఫ్రిజ్‌లో ఉంచాలి.
రిఫ్రెష్, హైడ్రేటింగ్ పానీయం కోసం చియా గింజలను నీటితో కలిపి, నిమ్మకాయ రసంతో తీసుకుంటే మంచి రుచిగా ఉంటుంది.
అంతేకాకుండా అదనపు పోషకాహారంగా చియా విత్తనాలను ఉదయం పూట వోట్మిల్లో కలిపి తీసుకుంటే సరి.
కమ్మని సలాడ్స్ మీద చియా గింజలు చల్లి తీసుకున్నా రుచి పరంగానే కాదు.. పోషకాల పరంగా కూడా మంచి కాంబినేషన్ అవుతుంది.మఫిన్, బ్రెడ్ వంటి వాటిలో చియా గింజలను వాడటం వల్ల కొత్త రుచిని తీసుకురావచ్చు. చియా గింజలను గుడ్డుకు ప్రత్యామ్నాయంగా వాడి చూడండి. వీటి జిరుగు, జిగటతో వంటలకు కొత్త రుచి వచ్చి చేరుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచి సపోర్ట్ ఇస్తాయి.ఇన్ని రకాలైన ఉపయోగాలు ఉన్న చియా సీడ్స్ ను మన ఆహారం లో భాగంగా చేసుకొవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్దిగా లభిస్తాయి.







Untitled Document
Advertisements