రోజు ఇంట్లో పాలు పొంగితే శుభమా? అశుభమా ?

     Written by : smtv Desk | Fri, Mar 29, 2024, 01:59 PM

రోజు ఇంట్లో పాలు పొంగితే  శుభమా? అశుభమా ?

డైలీ మార్నింగ్ ప్రతి ఒకరి ఇంట్లో పాలు వేడి చేయడం సహజమైన విషయము . కొన్ని సార్లు పాలు స్టవ్ మీదపెట్టి ఏదో పని చేస్తూ ఉంటాం అలాంటి సమయంలో పాలు పొంగిపోవడం జరుగుతూ ఉంటుంది . అలా ఒక్కసారి అంటే ఏమి కాదు కానీ ప్రతిసారి అలాగే
జరిగితే దానికి కారణము అది వాస్తుదోష సూచన అని చాలా మంది అనుకుంటారు. అయితే వేడి చేస్తున్నప్పుడు పాలు పదే పదే పొంగిపోతే ఆ ఇంటిలోని కుటుంబ సమస్యలకు ముప్పు తప్పదని సూచన.

పాలు పొంగడం వెనుక అర్థం ఏమిటి అంటే వాస్తు శాస్త్రంలో పాలను చంద్రుని కారకంగా పరిగణిస్తారని తెలుస్తోంది . కాబట్టి పాలు తరచుగా చిందటం అరిష్టానికి సంకేతం. మండుతున్న పాలు వాయువుపై పడితే అది చంద్ర దోషాన్ని కలిగిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది .

పాలు పొంగితే ఇంట్లో గొడవలే: కుజుడు,చంద్రుడు రెండు వ్యతిరేక స్వభావం గల గ్రహాలు. అంగారకుడి కారక లేదా అగ్ని. ఈ పరిస్థితిలో పాలు వేడి చేసేటప్పుడు చిందటం అశుభం. అంతేకాకుండా ఇంట్లో ప్రశాంతతను కూడా పాడుచేస్తుంది. ఇది ఇంటి నివాసితులలో ఆగ్రహాన్ని కూడా రేకెత్తిస్తుంది. కుటుంబంలో సంఘర్షణ పరిస్థితులను సృష్టించవచ్చు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే పండితుడిని లేదా జ్యోతిష్యుడిని సంప్రదించాలని అంటుంటారు . ప్రాథమికంగా చంద్రుడు , అంగారకుడిని ప్రశాంతంగా ఉంచడానికి మార్గాలను కనుగొనాలి రోజూ వంట చేసే సమయంలో పాలు పొంగితే ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని అర్థం. నిజానికి ప్రతిరోజూ పాలను వేడి చేస్తుంటాం. ఆ సమయంలో అవి చిమ్మితే, అది అన్నపూర్ణా దేవిని కలవరపెడుతుంది అని పూర్వ కాలం నుండి ఉన్న నమ్మకం . ఏది ఏమైనా పాలను వేడి చేసేటప్పుడు మాత్రం చాల జాగ్రత్తగా ఉండి ఆ పాలు పొంగిపోకుండా చూసుకోవడం వలన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి .








Untitled Document
Advertisements