వంటలు రుచిగా ఉండాలి అంటే ఇంగువను ఇలా వాడండి..

     Written by : smtv Desk | Fri, Mar 29, 2024, 02:38 PM

వంటలు రుచిగా ఉండాలి అంటే ఇంగువను ఇలా వాడండి..

వంట ఇంట్లో వాడే పదార్థాలలో చాల రకాలైన మసాలాలు ఉంటాయి . కొన్ని మసాలాలు కొన్ని రకాలైన వంటలలోనే వేస్తారు .అయితే
మీరు ఎక్కువగా పులిహోర ,సాంబార్ వంటి వాటిలో వాడే సుగంధ ద్రవ్యం ఇంగువ . ఇంగువ వాడకం ఈనాటిది కాదు. వందల ఏళ్ల నుంచి ఇంగువను ఆహారంలో భాగం చేసుకున్నారు. భారతీయ సుగంధ ద్రవ్యాలలో ఇంగువదీ ప్రత్యేక స్థానం. అయితే ఇప్పుడు దీనిని వాడే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. నిజానికి ఇంగువను సరైన పద్ధతిలో వాడితే ఆరోగ్యానికే కాదు, రుచికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని కూరల్లో వాడడం వల్ల రెట్టింపు రుచి రావడం ఖాయం.

ఇంగువను ఎలా వాడాలో తెలియక చాల మంది వాడడానికి భయపడుతుంటారు . నూనె లేదా నెయ్యిలో ఇంగువను వేడి చేయడం వల్ల దాని రుచి, వాసన పెరుగుతాయి. అలా వేడి చేసిన ఇంగువను కూరల్లో కలపడం వల్ల రుచి రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా పప్పు వండినప్పుడు తాలింపులో ఇంగువను కూడా నూనెలో వేసి లేదా నెయ్యిలో వేసి వేయించి అప్పుడు పప్పులో కలపండి. ఇది ఎక్కువ రుచిని అందించడంతోపాటు సువాసనను ఇస్తుంది. పోషకాల ఇంగువలోని పోషకాలు రెట్టింపు అవుతాయి.

ఇంగువను ఎప్పుడు పడితే అప్పుడు తాలింపులో వేసేయకూడదు. తాలింపు వేసేటప్పుడు జీలకర్ర, ఆవాలు, కరివేపాకులు వంటివి వేస్తారు. ఇంగువను మొదటగా నూనెలో వేసి ఆ తర్వాతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వంటివి వేయాలి. ఇలా వేయడం వల్ల ఇంగువలోని రుచి, పోషకాలు నెయ్యి లేదా నూనెలోకి ఇంకిపోతాయి. ఇవి కూర లేదా పప్పులో వేసినప్పుడు అంతటా పంపిణీ అవుతాయి. అంతేకాదు ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి శరీరానికి ఇంగువ సాయం చేస్తుంది.

ఇంగువను పసుపు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం వంటి ఇతర మసాలా దినుసులతో కలపడం వల్ల రుచి పెరుగుతుంది. కాబట్టి వీటిని మిక్సీలో వేసి రుబ్బడం వంటివి చేసినప్పుడు ఇంగువను కూడా కలిపి ఆ పని చేయండి దీనికి రుచి అధికంగా ఉంటుంది. దీన్ని చిటికెడు వేసినా చాలు ఘుమఘుమలాడిపోతుంది. కాబట్టి ఇంగువను చాలా తక్కువ పరిమాణంలోనే వాడాలి. ఎక్కువగా వేస్తే అది చేదు రుచి వచ్చేస్తుంది. దీనిని పప్పు కూరల్లో వాడడం వల్ల జీర్ణాశయానికి మేలు జరుగుతుంది. జీర్ణక్రియకు సహాయం చేయడంలో ఇంగువ ముందుంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి రాకుండా అడ్డుకుంటుంది. కూరల్లో ఇంగువను జోడించడం వల్ల జీర్ణ క్రియకు మేలు జరుగుతుంది. ఈ ఆహారాన్ని అయినా త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఉన్న ఇంగువను తగిన మోతాదులో వాడుకొని ఆహారానికి మంచి రుచిని ట్రస్ట్ తెచుకుందాము .






Untitled Document
Advertisements