ఇంట్లో తయారుచేసుకునే ఈ పానీయంతో వడదెబ్బకు చెక్

     Written by : smtv Desk | Fri, Mar 29, 2024, 02:52 PM

ఇంట్లో తయారుచేసుకునే ఈ పానీయంతో వడదెబ్బకు చెక్

ఈ సారి ఎండాలు చాల ఎక్కువగా ఉన్నాయి . ఉదయం పూట దాటింది అంటే బయటకు రావడానికి జనాలు భయపడుతున్నారు . అంతేకాకుండా ఎండా వేడిని తట్టుకోవడానికి చిన్న పిల్లలు, ముసలివారు ,గర్భిణీలు ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకోవాలి. లేకుంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. మండే ఎండల్లో ఒక గంట అలా బయటకు వెళ్లి వస్తే చాలు శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. కొందరు వడదెబ్బకు గురవుతారు. అందుకే ఇంట్లో మజ్జిగతో పాటు బార్లీ నీళ్లను కూడా తాగుతూ ఉండాలి. వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చు. అలాగే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటుంది.ముఖ్యంగా బార్లీ నీళ్లను తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


బార్లీ నీళ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాను కాపాడుతుంది. అందుకే బార్లీ నీళ్లను వేసవిలో కచ్చితంగా ప్రతిరోజు తాగేందుకు ప్రయత్నించాలి.

డయాబెటిస్ వారు
అధిక రక్తపోటుతో బాధపడేవారు, డయాబెటిస్ రోగులు కూడా ప్రతిరోజూ బార్లీ నీళ్లను తాగితే వారు ఆరోగ్యంగా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. బార్లీ నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయం కూడా శుభ్రపడుతుంది. పిల్లలకు ఖచ్చితంగా బార్లీ నీళ్లను అలవాటు చేయండి. ఇది వారిలో మలబద్ధకం సమస్య రాకుండా అడ్డుకుంటుంది.అంతేకాకుండా జ్వరం, నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడేవారు బార్లీ నీళ్లను తాగితే శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. ఎవరికైతే చెమట అధికంగా పట్టి శరీరంలో నీరు బయటికి పోతుందో వారు వెంటనే బార్లీ నీళ్లను తాగాలి. లేకుంటే శరీరంలో నీటి శాతం తగ్గి తీవ్రమైన నీరసం వచ్చేస్తుంది.

డీహైడ్రేషన్ సమస్య వలన శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తుంది. కాబట్టి చెమట ఎక్కువ పట్టగానే మజ్జిగ, బార్లీ నీళ్లు తాగడం అలవాటుగా మార్చుకోండి. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా బార్లీ నీళ్లను ఎప్పటికప్పుడు తాగుతూ ఉండాలి. శరీరంలో వేడి పెరుగుతుంటే బార్లీ నీళ్లను తాగడం వల్ల ఆ వేడి తగ్గి పోతూ ఉంటుంది. వీటిలో మాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి బార్లీ నీళ్లు అన్ని రకాలుగా మీరే చేస్తాయి.
అధిక బరువుతో బాధపడేవారు బార్లీ నీళ్లను తాగడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఒకరోజు తాగితే సరిపోదు.. ప్రతిరోజూ తాగుతూ ఉండాలి. ఉదయాన్నే బార్లీ నీళ్లను తాగితే పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇతర ఆహారాలను మీరు తీసుకోరు. అలాగే బార్లీ నీళ్లలో పోషకాలు ఉంటాయి. కాబట్టి శరీరం నీరసపడదు, ఈ రకంగా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.

కొన్ని రకాల క్యాన్సర్లతో పోరాడే శక్తి బార్లీ నీళ్లకు ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద పేగుల్లో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి. శరీరంలో హానికరమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో ఇవి సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి బార్లీలు చేసే మేలు అంతా ఇంతా కాదు.

గర్భిణీలు కచ్చితంగా బార్లీ నీళ్లను తాగుతూ ఉండాలి. ఇలా తాగడం వల్ల వారి బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. వారికి అలసట త్వరగా రాదు. రోజుకి రెండుసార్లు వీరు బార్లీ నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి. ఇక మహిళలు ఖచ్చితంగా తాగాల్సిన వాటిలో ఈ బార్లీ నీళ్లు ఒకటి. వీటిని తాగడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటికి పోతాయి. మూత్రంలో కిడ్నీలో ఉన్న సూక్ష్మమైన రాళ్లు కరిగే అవకాశం ఉంది. ఇన్ని రకాలైన మంచి గుణాలు ఉన్న బార్లీ గింజలను వాటర్ గా చూసుకొని తాగడం అలవాటు చేసుకోవాలి . ఈ ఎండా వేడి నుండి ఉపశమనం పొందడానికి వీటిని తాగడం చాల మంచిది .





Untitled Document
Advertisements