పది పోయే.. పదమూడు వచ్చే..

     Written by : smtv Desk | Wed, Feb 21, 2018, 03:47 PM

పది పోయే.. పదమూడు వచ్చే..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 : మొబైల్ వినియోగదారులకు భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం(డాట్) సరికొత్త ఆలోచన చేసింది. తమ ఆపరేటర్లకు ఇక నుండి 10 అంకెలకు బదులు 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను ఇవ్వాలని ఆదేశించింది. అంతే కాదు ఇప్పటి వరకు ఉన్న 10 అంకెల ఫోన్ నంబర్లను సైతం 13 అంకెలకు మార్చనున్నారు.

ప్రస్తుతమున్న మొబైల్‌ నంబర్లను 13అంకెలకు మార్చేందుకు 2018 అక్టోబరు 1 నుండి 2018 డిసెంబరు 31లోగా మార్చుకోవాలంటూ గడువు విధించారు. సిమ్‌తో నడిచే మెషిన్ టు మెషిన్ పరికరాలన్నింటికీ 13అంకెల నంబరు విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 1 నుండి మొబైల్ వినియోగదారులకు 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను మాత్రమే ఇవ్వనున్నారు.

Untitled Document
Advertisements