విభిన్న కథతో రానున్న మెగాప్రిన్స్..

     Written by : smtv Desk | Wed, Feb 21, 2018, 06:00 PM

విభిన్న కథతో రానున్న మెగాప్రిన్స్..

హైదరాబాద్, ఫిబ్రవరి 21: టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా 'తొలిప‍్రేమ' సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ సరసన రాశిఖన్నా కథానాయకగా నటించింది. ప్రస్తుతం ఈ మెగా వారసుడు తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. 'ఘాజీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ పెట్టనున్నట్లు టాలీవుడ్ టాక్.

అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో గ్రహాంతరవాసుల ప్రస్థావన కూడా ఉంటుందని సమాచారం. గతంలో సంకల్ప్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా వచ్చిన 'ఘాజీ' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొంది.

Untitled Document
Advertisements