నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నాపై కుట్రలు : బోండా

     Written by : smtv Desk | Sun, Feb 25, 2018, 04:33 PM

నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నాపై కుట్రలు : బోండా

విజయవాడ, ఫిబ్రవరి 25 : రాజకీయంగా తనను ఎదుర్కోలేక తనపై కొందరు కుట్ర పన్నుతున్నారంటూ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. తానూ భూ అక్రమాలకూ పాల్పడినట్లు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న ఆయన.. ఒకవేళ అక్రమాలకూ పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ కలెక్టర్ కు లేఖ రాశారు. భూ కబ్జాలపై తానూ ఎలాంటి బహిరంగ సభలకైనా సిద్దమన్నారు. అంతేకాని అనుచరులు తప్పు చేస్తే ఆ బాధ్యత తనది కాదు అంటూ వివరణ ఇచ్చారు.

Untitled Document
Advertisements