"షీ టీమ్స్" దేశానికే ఆదర్శం : నాయిని

     Written by : smtv Desk | Sat, Mar 03, 2018, 02:52 PM


హైదరాబాద్, మార్చి 3 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించిన షీ టీం ప్రదర్శనను తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... "షీ టీమ్స్ దేశానికే ఆదర్శం. దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్. పోలీస్ ఎక్స్‌పో ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది” అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, సినీ నటి రాశిఖన్నా పాల్గొన్నారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. షీ టీమ్స్ వల్లే హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగింది. మహిళల్లో షీటీమ్స్ పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్నాయి. మహిళల భద్రతకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందన్నారు.

Untitled Document
Advertisements