ఉత్తమ నటి "ఆస్కార్" చోరీ..!

     Written by : smtv Desk | Tue, Mar 06, 2018, 01:46 PM

ఉత్తమ నటి

లాస్‌ఏంజెల్స్‌, మార్చి 6 : అమెరికా లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 90వ "ఆస్కార్ అవార్డు"ల ప్రధానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయ౦ తెలిసిందే. ఇందులో భాగంగా ఆస్కార్ అవార్డును.. ఉత్తమ నటిగా "ఫ్రాన్సెస్‌ మెక్‌ డార్మండ్"‌, నటుడిగా గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ అందుకున్నారు. అయితే ఈ అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన గవర్నర్ బాల్ కార్యక్రమానికి హాజరైన టెర్రీ బ్రయాంట్‌ అనే 47 ఏళ్ల వ్యక్తి నటి ఫ్రాన్సెస్‌ అవార్డును చోరీ చేశాడు.

కాసేపటికి అవార్డు పోయినట్లు గుర్తించిన మెక్‌ డార్మండ్.. ఆ ప్రదేశమంతా గాలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే గాలింపులు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ట్రోఫీని స్వాధీనం చేసుకొని ఫ్రాన్సెస్‌ కు అప్పగించగా.. ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. "త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ" అనే సినిమాకు గానూ ఫ్రాన్సెస్‌ ఉత్తమ నటిగా ఆస్కార్‌ గెలుచుకున్నారు.

Untitled Document
Advertisements