"ఆటా నాదే వేటా నాదే" అంటున్న వెంకీ..!

     Written by : smtv Desk | Fri, Mar 09, 2018, 12:11 PM


హైదరాబాద్, మార్చి 9 : "ఆట నాదే వేటా నాదే" అంటూ మన ముందుకు రానున్నాడు విక్టరీ వెంకటేశ్.. తేజ దర్శకత్వంలో వెంకటేశ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చేతిలో బుక్ పట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని ఎంతో అమాయకంగా కనిపిస్తున్న వెంకటేశ్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి "ఆట నాదే వేటా నాదే" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకీ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా ప్రముఖ కథానాయిక శ్రియ నటించనున్నట్లు సమాచారం. ఇదివరకు వీరిద్దరూ "సుభాష్ చంద్రబోస్", "గోపాల గోపాల" చిత్రంలో కలిసి నటించారు.

Untitled Document
Advertisements