హృతిక్‌ తల్లికి ఉమెన్స్ డే సర్‌ప్రైజ్‌..!

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 11:52 AM

హృతిక్‌ తల్లికి ఉమెన్స్ డే  సర్‌ప్రైజ్‌..!

ముంబై, మార్చి 10 : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తల్లి పింకీ రోషన్‌, సోదరి సునైనా రోషన్‌కు 'ఉమెన్స్ డే'కి సర్‌ప్రైజ్‌ చేశారట. హృతిక్ ప్రస్తుతం 'సూపర్ 30' అనే బయోపిక్ లో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ప్రముఖ గణితశాస్త్ర నిపుణుడు, సూపర్‌ 30 కోచింగ్‌ సెంటర్‌ అధినేత ఆనంద్‌ కుమార్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర షూటింగ్ వారణాసిలో జరిగింది.

షూటింగ్‌ విరామ సమయంలో హృతిక్‌ షాపింగ్‌కు వెళ్లి రోషన్‌ తన తల్లికి, సోదరికి బహుమతులు తీసుకున్నాడట. అవేంటో కాదు.. వారు ఎంతో ఇష్టపడే వారణాసి ప్రఖ్యాతి చెందిన బెనారస్‌‌ చీరలను ఇద్దరికి తీసుకొచ్చి ఇచ్చారు. హృతిక్‌ బహుమతి వాళ్ళ తల్లి, సోదరికి ఎంతో నచ్చిందట.

పట్నాకు చెందిన ఆనంద్‌ కుమార్‌ ఏటా 30 మంది పేద విద్యార్థులకి ఐఐటి ఉచిత శిక్షణ ఇస్తుంటారు. ఆయన జీవితంలోని పోటుపాటులను వికాస్ భట్ 'సూపర్ 30' సినిమాలో చూపించబోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements