కోదండరాం అరెస్ట్..

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 05:30 PM

కోదండరాం అరెస్ట్..

హైదరాబాద్, మార్చి 10 : తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్‌బండ్‌ దగ్గర మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభకు వెళ్లేందుకు ప్రయత్నించిన అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోదండరాంను బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అతనితో పాటు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డిని నారాయణగూడలోని మగ్దూం భవన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఐకాస చేపట్టిన మిలియన్‌ మార్చి స్ఫూర్తి సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం నుండి ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements