టీడీపీపై కత్తి షాకింగ్ కామెంట్స్..!

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 12:00 PM

టీడీపీపై కత్తి షాకింగ్ కామెంట్స్..!

హైదరాబాద్, మార్చి 11 : సినీ విమర్శకుడు కత్తి మహేష్ తన ట్విట్టర్ వేదికగా పలు షాకింగ్ ట్వీట్స్ చేశాడు. టీడీపీని ఉద్దేశించి చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఉద్దేశిస్తూ.. "మంత్రుల చేత రాజీనామాలు చేయించి ప్రభుత్వంలో లేమంటూ బుకాయింపు. ఎంపీలను మాత్రం సపోర్ట్ గా ఉంచి ఎన్డీఏ లో కేవలం భాగాస్వాములమని సమర్ధింపు. చంద్రబాబు నీకో సలాం" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా.. "తెలుగుదేశం రాజీనామా చేస్తే అది రాష్ట్రం కోసం త్యాగం. అదే వైసీపీ రాజీనామా చేస్తే నాటకం. జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టె అర్హత లేదు, టీడీపీకి అది ఆఖరి అస్త్ర౦. ఈ చిన్న లాజిక్ అర్ధమైన వారి తల వేయి ముక్కలవుతుంది. అదే చంద్రబాబు మాయ" అంటూ విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

Untitled Document
Advertisements