13న బంద్‌ వాయిదా వేసుకోండి: కడియం

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 01:14 PM

 13న బంద్‌ వాయిదా వేసుకోండి: కడియం

హైదరాబాద్, మార్చి 11‌: ఎమ్మార్పీఎస్ ఈ నెల 13న చేపట్టిన బంద్‌ను వాయిదా వేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ఆ రోజున లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులకు రసాయన శాస్ర్తం పరీక్ష ఉందని.. బంద్ ప్రకటించిన తరుణంలో వారిలో ఆందోళన నెలకొందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బంద్‌ ప్రయత్నాన్ని విరమించుకోవాలని అభ్యర్థించారు. బంద్‌కు మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలతో ఇప్పటికే చర్చలు జరిపామని కడియం పేర్కొన్నారు. ఒకవేళ మొండిగా వ్యవహరించి బంద్ చేపడితే నిమిషం నిబంధనకు సడలింపు ఉంటుందని ప్రకటించారు. బంద్‌ పేరుతో పరీక్షకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Untitled Document
Advertisements