రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ..

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 03:34 PM

రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ..

అమరావతి, మార్చి 11 : తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభ సమరంకు వెళ్లే అభ్యర్ధుల పేర్లు ఖరారు అయ్యాయి. ఎంతో ఉత్క౦ఠ రేపిన అభ్యర్ధుల ఎంపికలో పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్‌, కనకమేడల రవీంద్రబాబు పేర్లను అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ గడువు ముగియనుంది.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి టీడీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర ఉత్క౦ఠ కొనసాగింది. తొలుత రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్‌, వర్ల రామయ్య పేర్లు వినిపించగా, తర్వాత కనకమేడల రవీంద్రబాబు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

Untitled Document
Advertisements