దురద పెడితే ఒకరికొకరు గోక్కోండి : కిషన్‌రెడ్డి

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 05:08 PM

దురద పెడితే ఒకరికొకరు గోక్కోండి : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 11 : “మీకు దురద పెడితే ఒవైసీ, కేసీఆర్‌లు ఒకరికొకరు గోక్కోండి, కానీ బీజేపీ వచ్చి గోకాలని డిమాండ్‌ చేయటం సరికాదు” అని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. లక్ష మంది కేసీఆర్‌లు పుట్టినా తాను పార్టీ మారనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘దేశంలో పెత్తందార్ల పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్‌ఎస్సే. కేసీఆర్‌ను మించిన పెత్తందారు దేశంలో ఇంకెవరూ ఉండరు’ అని విమర్శించారు. బీజేపీకి గుణపాఠం చెబుతామని టీఆర్‌ఎస్‌ అనడం హాస్యాస్పదమని, నాలుగేళ్లవుతున్నా హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్ను పోటు పొడిచినందుకు కేసీఆర్‌కే ముందుగా గుణపాఠం చెప్పాలన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని తనే గద్దెనెక్కినందుకు, కనీసం సీఎం సొంత నియోజకవర్గంలోనైనా రైతుల ఆత్మహత్యలు నివారించనందుకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడుస్తున్నందుకు, రైతు రుణమాఫీ పూర్తి చేయనందుకు, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.

Untitled Document
Advertisements