అసెంబ్లీ సమావేశాల్లో కోమటిరెడ్డి వీరంగం..!

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 11:42 AM

అసెంబ్లీ సమావేశాల్లో కోమటిరెడ్డి వీరంగం..!

హైదరాబాద్, మార్చి 12 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన కాసేపటికే సభలో కాంగ్రెస్ శాసనసభ్యులు భీభత్సం సృష్టించారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా పేపర్లు, పెన్నులు విసురుతూ.. గందరగోళం సృష్టించారు. ఈ క్రమ౦లో కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మైక్ హెడ్‌ఫోన్‌ను గవర్నర్ పైకి విసిరారు.

దీంతో ఆ మైక్ నేరుగా వెళ్లి పక్కనే ఉన్న గాంధీ ఫొటోకు తగిలి దాని పక్కన కూర్చున్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై పడింది. ఈ ఘటనలో స్వామిగౌడ్‌కు తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్వామిగౌడ్‌కు సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి చికిత్సను అందిస్తున్నారు.

Untitled Document
Advertisements