అమరావతిలో జన'సేన' ఇంటి నిర్మాణం..

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 12:10 PM

అమరావతిలో జన'సేన' ఇంటి నిర్మాణం..

అమరావతి, మార్చి 12 : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణానికై నేడు భూమి పూజ చేశారు. ఇందు నిమిత్తం కుటుంబ సమేతంగా నిన్న విజయవాడకు చేరుకున్న ఆయన ఓ ప్రైవేటు హోటల్‌లో బస చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని సాహితీ వెంచర్‌లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు, పార్టీ ముఖ్య నాయకులు మాత్రమే హాజరయ్యారు. ఈ నిర్మాణం చేపట్టనున్న ఇంటిని భవిష్యత్తులో పార్టీ కార్యాలయం గానూ వినియోగించే అవకాశాలు లేకపోలేదు. కాగా పవన్.. ఈ భూమి పూజ అనంతరం ఈ నెల 14న నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఏర్పాట్ల విషయంపై పార్టీ సభ్యులతో చర్చించనున్నారు.

Untitled Document
Advertisements