50కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 06:30 PM

50కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..

ఖాట్మండు, మార్చి 12 : నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 50కి చేరింది. యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం నేటి మధ్యాహ్నం ఖాట్మండులో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో అందులో ప్రయాణిస్తున్న వారు ఘటనాస్థలిలోనే సజీవ దహనమయ్యారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు ఆవరించాయి.

ఈ విమానంలో మొత్తం సుమారు 67 మంది ప్రయాణికులు ఉండగా కేవలం 17 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడగా క్షతగాత్రులను సమీపంలో గల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానాన్ని కత్తిరించి మిగతా వారిని కాపాడేందుకు పోలీసులు, సైనికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమానాశ్రయ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Untitled Document
Advertisements