చైసామ్ ల జంటకు భారీ డిమాండ్.. !

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 06:46 PM

చైసామ్ ల జంటకు భారీ డిమాండ్.. !

హైదరాబాద్, మార్చి 12 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హిట్ పెయిర్ లలో నాగ చైతన్య, సమంతాలు ఒకరు. వీరు నటించిన 'ఏం మాయ చేసావే', 'మనం' చిత్రాలు విజయం సాధించడంతో హిట్ పెయిర్ గా మారిపోయారు. గతేడాది వీరిద్దరూ వివాహం చేసుకున్నారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నారు. తాజాగా 'నిన్ను కోరి' దర్శకుడు శివ నిర్వాణ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా చేయడానికి చైసామ్ లని సంప్రదించగా.. వారు కథ నచ్చటంతో ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

కాని చైతన్య, సమంతా ఇద్దరికీ కలసి భారీ పారితోషికం అడిగారని సమాచారం. మాములుగా చైతన్య రెమ్యునరేషన్ 3 నుండి 4కోట్ల వరకు.. సమంతది 1 నుండి 1.50 వరకు ఉంటుంది. వారి వివాహం తర్వాత చైసామ్ లు జంటగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఏకంగా 7 కోట్లు అడిగారు. వారి జంటకున్న క్రేజ్ బట్టి నిర్మాతలు కూడా వారడిగిన పారితోషికానికి సమ్మతము తెలిపినట్లు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య 'శైలజ రెడ్డి అల్లుడు' సినిమా షూటింగ్ లో బిజీ కాగా.. సమంతా నటించిన 'రంగస్థలం' చిత్రం విడుదలకు ముస్తాబైంది.

Untitled Document
Advertisements