కేఎల్ రాహుల్ ఖాతాలో చెత్త రికార్డు..

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 12:54 PM

 కేఎల్ రాహుల్ ఖాతాలో చెత్త రికార్డు..

కొలంబో, మార్చి 13 : నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ కే ఎల్ రాహుల్ ఓ చెత్త రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు. లక్ష్య ఛేదన కు దిగిన టీమిండియా జట్టులో మూడు వికెట్లు పడిన తర్వాత నాలుగవ స్థానంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ ముందు ఆత్మవిశ్వాసంగా ఆడిన, తర్వాత హిట్ వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు.

దీంతో భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో హిట్‌ వికెట్‌ రూపంలో వెనుదిరిగిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 10వ ఓవర్లో కుశాల్‌ మెండీస్‌ వేసిన ఐదో బంతిని ఆడే క్రమంలో కాస్త వెనక్కి జరిగాడు. ఆ సమయంలో అతడి కుడి పాదం వికెట్లను తాకడంతో హిట్‌ వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు.

ఇక వన్డే క్రికెట్లో ఇప్పటి వరకు 65 మంది హిట్‌ వికెట్‌ రూపంలో ఔటవ్వగా ఇందులో నలుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. నయన్‌ మోంగియా, అనిల్‌కుంబ్లే, సచిన్‌ తెందుల్కర్‌, విరాట్‌ కోహ్లీహిట్ వికెట్ గా పెవిలియన్ కు చేరారు.

Untitled Document
Advertisements