ఐపీఎల్‌ ప్రచార గీతం 'బెస్ట్‌ వర్సెస్‌ బెస్ట్‌'..

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 02:36 PM

ఐపీఎల్‌ ప్రచార గీతం 'బెస్ట్‌ వర్సెస్‌ బెస్ట్‌'..

ముంబయి, మార్చి 13 : ఐపీఎల్-11 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 7 నుండి మొదలయ్యే ఈ మెగా టోర్నీఈ వేసవిలో క్రీడాభిమానులను అలరించనుంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రచార గీతాన్ని సోమవారం నిర్వాహకులు ఆవిష్కరించారు. ‘బెస్ట్‌ వర్సెస్‌ బెస్ట్‌’ పేరుతో విడుదలైన ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.

దక్షిణాఫ్రికా ఫిల్మ్‌ డైరెక్టర్‌ డాన్‌ మాస్‌ , సంగీత దర్శకుడు రాజీవ్‌ వీ బల్లా, సింగర్‌ సిదార్థ్‌ బస్రూర్‌ ఈ గీతానికి రూపొందించారు. గత పది సీజన్లో టోర్నీ ప్రారంభానికి ముందు ప్రచార గీతానికి అభిమానుల్లో విశేష ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. విడుదలైన 12గంటల్లోపే ఈ ప్రచార గీతాన్ని 2 కోట్లకు పైగా వీక్షించారు.

Untitled Document
Advertisements