ఎన్టీఆర్ సతీమణి పాత్రలో విద్యాబాలన్

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 05:48 PM

ఎన్టీఆర్ సతీమణి పాత్రలో విద్యాబాలన్

హైదరాబాద్, మార్చి 13 : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించనున్నాడు. ఇదివరకే ఓకె అయిన ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడు తేజ నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ సతీమణి పాత్రకు బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వచ్చిన 'కహాని', 'హమారీ అధూరి కహాని', 'తుమ్హారీ సులు' వంటి చిత్రాలలో గృహిణి పాత్రలో నటించి ప్రశంసలను అందుకుంది. బరువు బాధ్యతలు ఉన్న ఎన్టీఆర్ సతీమణి బసవతారకం విద్యాబాలన్ పాత్రకు కరక్టుగా
సెటవుతుందని దర్శకుడు ఆమెను సంప్రదించాడని సమాచారం. కథ నచ్చడంతో ఆమె కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఈ నెల 29వ తేది నుండి సెట్స్ పైకి వెళ్లనున్నది.

Untitled Document
Advertisements