లోక్‌సభ రేపటికి వాయిదా..

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 07:04 PM

లోక్‌సభ రేపటికి వాయిదా..

న్యూఢిల్లీ, మార్చి 13: విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. మంగళవారం ఉదయం సభ మొదలైన వెంటనే వివిధ అంశాలపై విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొ౦ది. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు.


Untitled Document
Advertisements