అర్హులైన వారికి ఆహారభద్రత కార్డులు: ఈటల

     Written by : smtv Desk | Fri, Mar 23, 2018, 12:04 PM

అర్హులైన వారికి ఆహారభద్రత కార్డులు: ఈటల

హైదరాబాద్, మార్చి 23: అర్హులైన లబ్దిదారులు ఆహారభద్రత కార్డులను ఎపుడైనా తీసుకోవచ్చునని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం శాసనమండలి సమావేశంలో జరిగిన ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు రేషన్‌కార్డులకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఆహార భద్రత కార్డు సస్పెండ్ చేసింది వాస్తవమేనని, ఈపీఓఎస్ ప్రాజెక్టు పూర్తయినందున మార్చి 1వ తేదీ నుంచి నగరంలో ఈ కొత్త ఆహార భద్రత కార్డుల జారీని తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు.

గ్రామాల నుంచి సిటీకి, సిటీ నుంచి గ్రామాలకు వలసలు వెళ్తున్న వారి కార్డులను గుర్తించేందుకు, నకిలీ కార్డులను రద్దు చేసేందుకే ఈపీఓఎస్ మిషన్లను అమలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ చేపట్టినందున కొత్త కార్డుల జారీలో కొంత జాప్యం జరిగింది వాస్తవమేనని ఆయన వివరించారు.

Untitled Document
Advertisements