ప్రాక్టీస్‌లో సీఎస్ కే సారథి..

     Written by : smtv Desk | Fri, Mar 23, 2018, 12:30 PM

ప్రాక్టీస్‌లో సీఎస్ కే సారథి..

చెన్నై, మార్చి 23 : ఐపీఎల్-11 సీజన్ కోసం అన్ని జట్లు తమ సాధనను ప్రారంభించేశాయి. వచ్చే నెల 7న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీ సందడి ఇప్పటికే మొదలయ్యింది. కాగా రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగితున్న జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్ కే). ధోని నాయకత్వంలో వస్తున్నా ఈ జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



తాజాగా ధోనీ బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోలను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్విటర్‌ ద్వారా షేర్ చేసుకుంది. ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ నుంచి 'మిస్టర్ కూల్' చెన్నై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. లీగ్ లో భాగంగా సీఎస్ కే తొలి మ్యాచ్‌ ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.





Untitled Document
Advertisements